
కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పరిధిని పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల పంజాబ్ ప్రభుత్వం శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇది సమాఖ్య నిర్మాణంపై దాడిగా అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ నుంచి 50 కి.మీ వరకు మూడు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, అస్సాం, పంజాబ్) సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికార పరిధిని కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసింది. ఆర్టికల్ 131 ప్రకారం ఈ సరిహద్దులు రాష్ట్రాల రాజ్యాంగ అధికార పరిధిలోకి వస్తుందని తెలిపారు. కేంద్రం ఇలా నిర్ణయం తీసుకోవడం రాష్ట్రాల హక్కులను ఆక్రమించడమే అని చెప్పింది. ఇప్పుడు కేంద్ర పొడించిన పరిధి రాష్ట్రం కింద వస్తుందని అయితే రాజ్యాంగం ప్రకారం అక్కడ శాంతి భద్రతల తమ పరిధిలోకి వస్తుందని పంజాబ్ తెలిపింది. కానీ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర అధికారాలను అక్రమణకు గురయ్యాయని పేర్కొంది.
స్కూళ్ల మూత.. 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం !
ఈ అంశంలో మోడీతో చర్చించిన దీది
బీఎస్ఎఫ్ పరిధి పెంపు నిర్ణయం పట్ల ఇది వరకే ప్రధాని మోడీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇది ఫెడరల్ హక్కులను కాలరాసే నిర్ణయమని, దీనితో సమైఖ్య స్పూర్తి దెబ్బ తింటుందని చెప్పారు. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం పట్ల వెనక్కు తగ్గుతుందా లేకపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి తన నిర్ణయాన్ని అమలు చేసుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది.