Supreme Court: "ఉద‌యం 7 గంట‌ల‌కే పిల్ల‌లు పాఠ‌శాల‌కు వెళ్లిన‌ప్పుడు.. కోర్టును 9 గంట‌ల‌కు ప్రారంభించ‌లేమా?"

Published : Jul 15, 2022, 04:35 PM IST
Supreme Court: "ఉద‌యం 7 గంట‌ల‌కే పిల్ల‌లు పాఠ‌శాల‌కు వెళ్లిన‌ప్పుడు.. కోర్టును 9 గంట‌ల‌కు ప్రారంభించ‌లేమా?"

సారాంశం

Supreme Court: సుప్రీంకోర్టు ప‌నివేళ‌ల‌పై జ‌డ్జి జ‌స్టిస్ యూయూ ల‌లిత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పిల్ల‌లు ఉద‌యం 7  గంట‌ల‌కే స్కూల్‌కు వెళ్లిన‌ప్పుడు.. న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు ఉద‌యం 9 గంట‌ల‌కే త‌మ‌ ప‌నిని ప్రారంభిచ‌లేరా? అని ప్ర‌శ్నించారు. 

Supreme Court: సుప్రీంకోర్టు ప‌నివేళ‌ల‌పై జ‌స్టిస్ యూయూ ల‌లిత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాఠశాల విద్యార్థులను ఉదాహరిస్తూ.. ఓ సందేశం ఇచ్చారు. పిల్లలు ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్తుంటే..  న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉదయం 9 గంటలకు తమ పనిని ఎందుకు ప్రారంభించ లేక‌పోతున్నారని ప్ర‌శ్నించారు. 
 
శుక్రవారం, సుప్రీంకోర్టు బెంచ్ సాధారణ రోజుల కంటే గంట ముందుగానే పని ప్రారంభించింది. సమయానికి కార్యాలయానికి చేరుకోని లేదా నిర్ణీత సమయానికి ముందే పని చేయకుండా ఉండే వ్యక్తులకు కూడా ఇది ఒక సలహా. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఉదయం 9.30 గంటలకు వ్యాజ్యాలపై విచారణ ప్రారంభించింది. అయితే, సాధారణంగా విచార‌ణ‌ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.

కోర్టులు తమ దినచర్యను ముందుగానే ప్రారంభించడాన్ని సమర్థిస్తున్నట్టు జ‌స్టిస్ యూయూ ల‌లిత్ స్ప‌ష్టంచేశారు. “నా ప్రకారం.. మనం ఆదర్శంగా ఉదయం 9 గంటలకు విచార‌ణ ప్రారంభించాలి.  పిల్లలు ఉదయం 7 గంటలకు స్కూల్‌కి వెళ్లగలిగితే.. 9 గంటలకు ఎందుకు రాలేకపోతున్నాం అని అన్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావడానికి  సీనియారిటీ క్రమంలో ఆయ‌న‌ అగ్రస్థానంలో ఉన్నారు.
 
పనులు త్వరగా ప్రారంభిస్తే.. 

'కోర్టుల పని ప్రారంభించడానికి సరైన సమయం ఉదయం 9.30 అని తప్పక చెప్పాలి' అని జస్టిస్ లలిత్ అన్నారు. మరుసటి రోజు కేసు ఫైల్ చదవడానికి సాయంత్రం మరింత సమయం లభిస్తుందని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. 'కోర్టులు ఉదయం 9 గంటలకు పని చేయడం ప్రారంభించి, 11.30 గంటలకు ఒక గంట విరామం తీసుకుని, మధ్యాహ్నం 2 గంటల వరకు రోజు పనిని ముగించవచ్చని జ‌స్టిస్ లలిత్ పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా న్యాయమూర్తులు సాయంత్రం పని చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని తెలిపారు. 
 
సుదీర్ఘ విచారణ అవసరం లేని.. కొత్త,  అలాంటి కేసులను మాత్రమే విచారించినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ పని చేస్తుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు  కేసులను విచారిస్తారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రామన్ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత బాధ్యతలను జ‌స్టిస్ ల‌లిత్ స్వీక‌రించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఈ ఏడాది నవంబర్ 8 వరకు సీజేఐగా కొనసాగనున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu