వీడియో గేమ్స్ కు బానిసయ్యాడని ఫోన్ లాక్కున్న తండ్రి.. మనస్థాపంతో 16 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య..

By Asianet News  |  First Published Nov 18, 2023, 12:01 PM IST

ఓ బాలుడు నిత్యం స్మార్ట్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుతుండటంతో ఆ తండ్రి విసిగెత్తిపోయాడు. చదువుపై ఫోకస్ పెట్టాలని, సెల్ ఫోన్ వాడొద్దని మందలించాడు. బాలుడి నుంచి ఫోన్ కూడా లాక్కున్నాడు. దీంతో మనస్తాపానికి గురై బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.


ఓ బాలుడికి 16 ఏళ్లు. స్మార్ట్ ఫోన్ లో మొబైల్స్ ఆడటం మొదలుపెట్టాడు. కొంత కాలం తరువాత ఆ గేమ్స్ కు బానిసయ్యాడు. చదువుకంటే దానిపైనే ఎక్కువగా ఫొకస్ పెడుతున్నాడు. కుమారుడు వీడియో గేమ్స్ కు బానిసయ్యాడని గ్రహించిన తండ్రి.. బాలుడు దగ్గరి నుంచి స్మార్ట్ ఫోన్ లాక్కున్నాడు. దీంతో మనస్థాపం చెందిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబాయిలోని మలాడ్ ప్రాంతం మాల్వానీలో 16 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. కొంత కాలంగా ఆ బాలుడు సెల్ ఫోన్ లో వీడియో గేమ్స్ కు బానిసయ్యాడు. అయితే దీనిని తండ్రి గమనించాడు. ఈ నెల 16వ తేదీన ఆ బాలుడిని ఈ విషయంలో మందలించాడు. గేమ్స్ ఆడటం మానేసి చదువుపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బాలుడు తండ్రితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో తండ్రి బాలుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని పడుకున్నాడు. 

Latest Videos

దీంతో ఆ బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి బాలుడు వంటగదిలో ఆత్మహత్యకు పాల్పడి, అపస్మారక స్థితిలో చేరుకొని కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని వెంటనే మాల్వానీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం బాలుడిని శతాబ్ది హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే మరణించాడని డాక్టర్లు వెల్లడించారు. కాగా.. గతంతో బాలుడి నుంచి తల్లిదండ్రులు ఒక సారి ఫోన్ లాక్కున్నారు. అప్పుడు కూడా బాలుడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కానీ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. అయితే ఈ సారి ఎలాంటి హెచ్చరిక లేకుండా దారుణానికి ఒడిగట్టాడు. 

ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఎలాంటి  సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో బాలుడి మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!