ప్రపంచ కప్ 2023 : కప్పుకొట్టడం కాదు, బంతిని పిచ్చకొట్టుడు కొట్టండి.. టీమిండియాకు సద్గురు సలహా..

By SumaBala Bukka  |  First Published Nov 18, 2023, 9:24 AM IST

అహ్మదాబాద్‌లో ఆదివారం జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ODI ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ లో మెన్ ఇన్ బ్లూ ట్రోఫీని గెలుచుకోవాలనే ఆలోచనతో కాకుండా బంతిని కొట్టడంపై దృష్టి పెట్టాలని  ఆధ్యాత్మిక గురువు సద్గురు సలహా ఇచ్చారు.


ఆదివారం జరిగే ODI ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. దేశమంతా వరల్డ్ కప్ ఫీవర్లో మునిగితేలుతోంది. ఆదివారం కప్పు ఎవరు కొడతారో అని ప్రపంచం ఆసక్తిగా చూస్తుండగా.. భారత్ అభిమానులు మాత్రం ఈ సారి ఎలాగైనా కప్పు మనకే దక్కాలన్నా ఆశతో ఉన్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజయ వ్యూహాలపై ఆలోచనల్లో ఉన్న "మెన్ ఇన్ బ్లూ"కి భారీ మద్దతు లభిస్తుంది. 

దేశం మొత్తం ఇప్పుడు ఇదే ఫీవర్ నడుస్తోంది. ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ క్రికెట్ వీరాభిమాని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకునేందుకు చిట్కా ఇవ్వమని అడిగారు. 

Latest Videos

undefined

దీనిమీద సద్గురు ప్రతిస్పందిన ఇప్పుడు వైరల్ గా మారుతోంది. “కప్ గెలవడానికి ప్రయత్నించొదు. మీ దగ్గరికి వచ్చే బాలును విసిరికొట్టండి.. ఈ 1 బిలియన్ మంది ప్రజలు కప్పు కోసమే వెతుకుతున్నారని మీ మనసులో పెట్టుకుంటే.. బంతిని మిస్సవుతారు. ప్రపంచ కప్ గెలిస్తే జరగబోయే అద్భుతాలను ఆలోచిస్తుంటే.. ఆ బంతి మీ వికెట్లను పడగొడుతుంది.

“ఈ ప్రపంచకప్‌ ఎలా గెలవాలనేది ఆలోచించవద్దు.. బాల్‌ను ఎలా బౌండరీ దాటించాలి? ప్రత్యర్థి వికెట్లను ఎలా పడగొట్టాలి? అనేది.. అంతే ఆలోచించాలి.. వరల్డ్‌కప్‌ గురించి ఆలోచించొద్దు.. దీంతో ప్రపంచకప్‌ను మీరు సాధిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. 

నవంబర్ 19, 2023న గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు, తమ చివరి ఎనిమిది ప్రపంచ కప్ మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టుతో పోటీ పడి, విజయాన్ని సాధించడానికి రెడీగా ఉంది. 

 

"Don't try to win the Cup, just hit the damn ball: Sadhguru's tip for India ahead of WC final" https://t.co/WN1GWMspKA

— Isha Foundation (@ishafoundation)
click me!