రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని కోరిన కూతురు.. నెల రోజుల బాలుడిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు..

Published : Aug 26, 2023, 02:23 PM ISTUpdated : Aug 26, 2023, 02:27 PM IST
రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని కోరిన కూతురు.. నెల రోజుల బాలుడిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు..

సారాంశం

రాఖీ కట్టేందుకు ఓ సోదరుడు కావాలని కూతురు పదే పదే అడగడంతో ఆ తల్లిదండ్రులు ఓ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నెలన్నర వయస్సు ఉన్న ఆ పసి బాలుడు కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకొని, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని కూతురు కోరడంతో ఆ తల్లిదండ్రులు చెల్లించిపోయారు. 17 ఏళ్ల కుమారుడు గతేడాది చనిపోవడంతో.. కూతురికి సోదరుడిని ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో అని మదనపడ్డారు. ఓ బాలుడిని కిడ్నాప్ చేస్తే.. కూతురికి సోదరుడి లేని లోటు తీరిపోతుందని, రాఖీ కూడా కట్టవచ్చని భావించారు. దీంతో ఓ నెల రోజుల బాలుడిని కిడ్నాప్ చేశారు. కానీ పసివాడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతులు అరెస్టు చేశారు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్ ప్రాంతం రఘుబీర్ నగర్ కు చెందిన సంజయ్ గుప్తా (41), అనితా గుప్తా (36) దంపతులకు 17 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కూతురు ఉన్నారు. అయితే గతేడాది కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో ఈ ఏడాది కూతురుకు రాఖీ కట్టేందుకు సోదరుడు లేకుండా పోయాడు. కొంత కాలం కిందట తనకు రాఖీ కట్టేందుకు ఓ సోదరుడు కావాలని ఆ బాలిక తన తల్లిదండ్రులను కోరింది. 

కూతురు కోరికను నెరవేర్చేందుకు ఓ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకురావాలని ఆ తల్లిదండ్రులు భావించారు. దాని కోసం ఓ ప్లాన్ కూడా వేశారు. అందులో భాగంగానే ఛట్టా రైల్ చౌక్ వద్ద ఫుట్ పాత్ పై నివసిస్తున్న ఓ దంపతుల నెల రోజుల కుమారుడిని గురువారం అర్ధరాత్రి దాటాక కిడ్నాప్ చేశారు. 3 గంటల సమయంలో నిద్రలో నుంచి లేచి చూస్తే ఆ దంపతులకు తమ బిడ్డ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందుతూ వారు తెల్లవారుజామున 4.34 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి సంచరిస్తున్నట్టు కనిపించారు. సుమారు 400 సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుల బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు పలు వివరాలు గుర్తించారు. చివరికి నిందితులు ఉన్నట్టు ఠాగూర్ గార్డెన్ లోని రఘుబీర్ నగర్ లోని సి-బ్లాక్ ప్రాంతాన్ని దాదాపు 15 మంది పోలీసులు ఆయుధాలతో చుట్టుముట్టారు. లోపలకు ప్రవేశించిన వెంటనే దంపతులతో కిడ్నాప్ అయిన బాలుడు కనిపించాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్) సాగర్ సింగ్ కల్సీ తెలిపారు.

కాగా.. గత ఏడాది ఆగస్టు 17న తమ కుమారుడు మేడపై నుంచి పడి చనిపోయాడని, రాబోయే రక్షా బంధన్ సందర్భంగా రాఖీ కట్టడానికి తమ 15 ఏళ్ల కుమార్తె సోదరుడిని అడుగుతోందని నిందితులైన సంజయ్, అనిత వెల్లడించారు. అందుకే బాలుడిని కిడ్నాప్ చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా.. వృత్తిరీత్యా టాటూ ఆర్టిస్ట్ అయిన సంజయ్ గతంలో మూడు క్రిమినల్ కేసుల్లో పాల్గొన్నాడని, అనిత మెహందీ కళాకారిణి అని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..