ప్రియుడితో కలిసుండగా చూసిందని... చెల్లెను చంపి, గోనెసంచిలో దాచేసిన జంటకు జీవితఖైదు...

Published : Aug 26, 2023, 02:13 PM IST
ప్రియుడితో కలిసుండగా చూసిందని... చెల్లెను చంపి, గోనెసంచిలో దాచేసిన జంటకు జీవితఖైదు...

సారాంశం

ప్రేమికుడితో కలిసి ఉండగా చూసిందని.. 12యేళ్ల సోదరిని ప్రియుడితో కలిసి చంపేసిందో యువతి. వీరికి జీవితఖైదు విధించింది కోర్టు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో 2019లో తన మైనర్ సోదరిని హత్య చేసిన కేసులో ఒక మహిళ, ఆమె ప్రేమికుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారి సంబంధం గురించి తెలుసుకుందని ప్రేమికులు ఇద్దరూ మైనర్ బాలికను హత్య చేశారు.

2019లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె భాగస్వామికి ఉత్తరప్రదేశ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది. "నాలుగు సంవత్సరాల క్రితం కాజల్ అనే మహిళ తన 12 ఏళ్ల సోదరి హిమాన్షిని ఆమె భాగస్వామి మోహిత్‌ తో కలిసి హత్య చేసింది. ఈ కేసులో న్యాయమూర్తి నిశాంత్ సింగ్లా వీరిద్దరినీ దోషులుగా నిర్ధారించారు" అని అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది వీరేందర్ కుమార్ నగర్ పిటిఐకి తెలిపారు.

రాఖీ కట్టడానికి సోదరుడు కావాలని కూతురు అడిగిందని.. పసికందు కిడ్నాప్..

ఒక్కో దోషికి రూ.65,000 జరిమానా కూడా కోర్టు విధించిందని తెలిపారు. మైనర్ బాలిక 2019 ఫిబ్రవరిలో ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఆమె గురించి వెతికిన కుటుంబసభ్యులకు ఆమె మృతదేహం వారి ఇంటికి సమీపంలో  గోనెసంచిలో దొరికింది. పోలీసులు ఈ విషయానికి సంబంధించి హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాజల్, మోహిత్ తమ సంబంధాన్ని దాచిపెట్టేందుకే బాలికను హత్య చేసినట్లు విచారణలో తేలింది. దోషుల సంబంధం గురించి మైనర్ బాలికకు తెలిసిందని.. వారిద్దరినీ ఆ చిన్నారిఅభ్యంతరకర స్థితిలో చూసిందని.. అందుకే హత్య చేసినట్లుగా వారు పోలీసుల ముందు అంగీకరించారని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..