తన ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కూతురు.. మహరాష్ట్రలో ఘటన

By team teluguFirst Published Dec 30, 2022, 12:30 PM IST
Highlights

తన ప్రేమకు అడ్డుగా ఉందని ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆమెకు 17 ఏళ్లు. ఇంకా మేజర్ కాలేదు. 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం బాలిక తల్లికి ఇష్టం లేదు. యువకుడితో ప్రేమ వ్యవహారం మానుకోవాలని కూతురుకు పలుమార్లు మందలించింది. అయినా కూడా ఆమె వినిపించుకోలేదు. ఈ క్రమంలో యువకుడు బాలిక ఇంటికి రాత్రి సమయంలో వచ్చి ఆమెతో గడిపేవాడు. ఇలా రాత్రి సమయంలో బాలిక, యువకుడు కలిసి ఉన్న సమయంలో తల్లి గమనించింది. దీనిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించడంతో బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేకెత్తించింది. 

‘జై శ్రీరాం’ అనలేదని 10 ఏళ్ల ముస్లిం బాలుడిని చితకబాదిన గిరిజనుడు.. మధ్యప్రదేశ్ లో ఘటన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబ్రాలోని అమృత్ నగర్ ప్రాంతంలో సబా హష్మి అనే 37 ఏళ్ల మహిళ తన ముగ్గురు కూతుర్లతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు అయి రెండు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ముగ్గురు కూతుర్లతో కలిసి ఆమె జీవించేంది. 

జీవనోపాధి కోసం ఆమె ఆ ప్రాంతంలో పిల్లలకు చదువు చెప్పేది. ఆమె బంధువులు కూడా ఆర్థిక సాయం అందించేవారు. అయితే ఆమె కూతుర్లలో 17 ఏళ్ల బాలికకు స్థానికంగా ఉండే ఓ 22 ఏళ్ల యువకుడితో పరిచయం అయ్యింది. అది వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. వీరిద్దరి ప్రేమను హష్మీ తీవ్రంగా వ్యతిరేకించింది. 

ఈ క్రమంలో కొన్ని నెలల కిందట ప్రేమికులు ఇద్దరు మరింత దగ్గరయ్యారు. యువకులు అప్పుడప్పుడు రాత్రి సమయల్లో హష్మీ ఇంటికి వచ్చి గడిపేవాడు. బుధవారం మధ్యాహ్నం సమయంలో కూడా ఆ యువకుడి బాలిక ఇంటికి వచ్చాడు. అయితే దీనిని తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహంతో కూతురు, తన ప్రియుడితో కలిసి తల్లిని కత్తితో పొడిచారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.

దీంతో భయపడిపోయిన ప్రేమికులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. బాధిత మహిళ కూలిపోవడంతో చుట్టూ రక్తం పేరుకుపోయింది. దీంతో చుట్టుపక్కల వారు ఇంట్లోకి ప్రవేశించి మహిళను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ మహిళ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు.

99వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి హీరాబెన్ జీవిత విశేషాలను బ్లాగ్ లో రాసిన ప్రధాని.. అందులో రాసుకొచ్చారంటే ?

కాగా.. హత్యకు పాల్పడి పారిపోయిన ప్రేమికులు ఇద్దరూ తమ ఫోన్ లను స్విచ్ఛ్ ఆఫ్ చేసుకున్నారు. వారిద్దరూ కళ్యాణ్ కు దగ్గరగా ఉన్న హాజీ మలంగ్ వైపు వెళ్లారని పోలీసులు గుర్తించారు. సాంకేతికను ఉపయోగించి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!