రామ మందిరం కోసం 28 ఏళ్ల బ్రహ్మచర్యం: ఇక జీవితమంతా ఇలా...

By narsimha lodeFirst Published Aug 5, 2020, 4:37 PM IST
Highlights

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదని 28 ఏళ్ల క్రితం రవీంద్ర గుప్తా కఠిన నిర్ణయం తీసుకొన్నాడు. ఇవాళ రామ మందిర నిర్మాణం కోసం అయోధ్యలో భూమి పూజ జరిగింది. 

అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదని 28 ఏళ్ల క్రితం రవీంద్ర గుప్తా కఠిన నిర్ణయం తీసుకొన్నాడు. ఇవాళ రామ మందిర నిర్మాణం కోసం అయోధ్యలో భూమి పూజ జరిగింది. అయితే ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకొంటారా....అంటే పెళ్లి చేసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన వయస్సు ఇప్పుడు 50 ఏళ్లు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కు చెందిన రవీంద్ర గుప్తా. 22 ఏళ్ల వయస్సులోనే ఆయన అయోధ్యకు చేరుకొన్నాడు. 1992లో ఆయన  కరసేవలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లాడు.  

also read:రామ మందిర నిర్మాణం దేశాన్ని ఏకం చేసేందుకు ఓ సాధనం: మోడీ

అయితే ఆ సమయంలోనే రామ మందిరం నిర్మాణమయ్యే వరకు పెళ్లి చేసుకోవద్దని నిర్ణయం తీసుకొన్నాడు.  భోపాల్ పట్టణంలోని లకేరపురకు చెందినవాడు రవీంద్ర గుప్తా. ఆయనను భోజ్పాలి బాబా అని కూడ పిలుస్తారు.అతను ఇప్పటివరకు నాలుగుసార్లు నర్మద ప్ర‌ద‌క్షిణ చేశారు. 

రవీంద్ర గుప్తా ఆయన ప్రస్తుతం బేతుల్ లో నివాసం ఉంటున్నాడు. ఈ పట్టణం అయోధ్యకు 900 కి.మీ దూరంలో ఉంటుంది. ఇవాళ రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని  ఆయన ప్లాన్ చేసుకొన్నారు. రానున్న రోజుల్లో రాముడి సేవలో, నర్మద పూజల కోసం కేటాయిస్తానని ఆయన ప్రకటించారు. 

click me!