రాహుల్ మోడీకి సివిల్స్‌లో 420వ ర్యాంక్... వీళ్లెప్పుడు రాశారు..?

Siva Kodati |  
Published : Aug 05, 2020, 03:40 PM IST
రాహుల్ మోడీకి సివిల్స్‌లో 420వ ర్యాంక్... వీళ్లెప్పుడు రాశారు..?

సారాంశం

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీస్ 2019 పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీస్ 2019 పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా విజేతలను పలువురు అభినందిస్తున్నారు. అయితే ఈ ఫలితాల్లో 420వ ర్యాంకు సాధించిన ఓ వ్యక్తి మాత్రం ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. దీనికి కారణం అతని పేరు. ఇంతకీ ఆయన పేరేంటో తెలుసా రాహుల్ మోడీ.

సగం పేరు కాంగ్రెస్ అగ్రనేతది.. రెండవది దేశ ప్రధానిది కావడమే ఆయనకు పాపులారిటీ తీసుకొచ్చింది. శతాబ్ధాల కలయిక  #RahulModi పేరుతో ఒక మీమ్ ఇప్పుడు ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది.

Also Read:సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ బిడ్డల సత్తా

దీనికి కొంతమంది రాహుల్, మోడీ ఇద్దరు యూపీఎస్సీ పరీక్షను పాసయ్యారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే మీరు  బీజేపీ సానుభూతిపరులా..? లేక కాంగ్రెస్ మద్ధతుదారులా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఆ విజేత కష్టాన్ని, కృషిని గుర్తించకుండా ఇలా చేయకూడదంటూ మరికొందరు సూచిస్తున్నారు. మరోవైపు 2019 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్