శివ‌సేన‌ను అంతం చేయ‌డమే ఈ తిరుగుబాటు ల‌క్ష్యం - షిండే శిబిరంపై ఉద్ద‌వ్ ఠాక్రే ఫైర్

Published : Jul 25, 2022, 12:14 PM IST
శివ‌సేన‌ను అంతం చేయ‌డమే ఈ తిరుగుబాటు ల‌క్ష్యం - షిండే శిబిరంపై ఉద్ద‌వ్ ఠాక్రే ఫైర్

సారాంశం

శివసేనను అంతం చేయడమే ప్రస్తుత తిరుగుబాటు లక్ష్యం అని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. తమ పార్టీ ఎంతో మంది సామాన్యులను అసాధారణమైన వ్యక్తులుగా మార్చిందని చెప్పారు. ఇప్పుడు కొత్త వారితో దానిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

శివసేనలో గతంలో జరిగిన తిరుగుబాటుల మాదిరిగా కాకుండా ఈసారి తిరుగుబాటు పార్టీని అంతం చేయ‌డమే ల‌క్ష్యంగా సాగుతోంద‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే అన్నారు. సేన హిందుత్వం కోసం రాజకీయాలలో మునిగితేలుతుంద‌నీ, కానీ బీజేపీ త‌న రాజకీయ ప్రయోజనాల కోసమే హిందుత్వాన్ని వాడుకుంటోంద‌ని ఆరోపించారు. దక్షిణ ముంబైలో వార్డు స్థాయి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయ‌న శివ‌సేన కార్య‌క‌ర్త‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

Teacher Recruitment Scam : ఆసుపత్రిలో ‘డాన్’ లా వ్యవహరిస్తున్నారు.. పార్థ ఛటర్జీపై ఈడీ ఆరోపణ...

‘‘ మునుపటి తిరుగుబాట్లలా కాకుండా ఈ తిరుగుబాటు లక్ష్యం శివసేనను శాశ్వతంగా అంతం చేయడమే. వారు మమ్మల్ని ఎదుర్కోవడానికి ప్రొఫెషనల్ ఏజెన్సీలను నియమించుకున్నారు. ఇది డబ్బు, విధేయతకు మధ్య జరుగుతున్న యుద్ధం ’’ అని అన్నారు. జూలై 27వ తేదీన 62 ఏళ్ల‌లోకి అడుగుపెట్ట‌నున్న ఠాక్రే.. ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛాలు కోరుకోవడం లేదని అన్నారు. పార్టీని విశ్వసిస్తున్నామని చెబుతూ పార్టీలోకి మ‌రింత మందిని చేర్చాల‌ని, ఎక్కువ మంది పేర్ల‌ను న‌మోదు చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. 

‘‘ తమదే అసలైన శివసేన అని వాదిస్తున్న వారి ఈ పోరాటం ఇప్పుడు భారత ఎన్నికల సంఘం వద్దకు వెళ్లింది. మనకు కేవలం శక్తి మాత్రమే కాదు, బలమైన మద్దతు, వ్యక్తులను పార్టీ సభ్యులుగా నమోదు చేసుకోవడం కూడా అవసరమే ’’ అని అన్నారు. తన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ ఠాక్రే పేరు ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్య‌లు చేశారు. అవసరమైతే 40 మంది సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన పార్టీలో (మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన్) విలీనం చేయడానికి అనుమతించడాన్ని పరిశీలిస్తానని చెప్పిన‌ట్టు స‌మాచారం ఉంద‌ని అన్నారు. 

దారుణం.. హార‌న్ కొట్టినా స్కూటీకి దారి ఇవ్వ‌లేద‌ని మూగ, చెవిటి వ్య‌క్తిని పొడిచి చంపిన మైన‌ర్...

‘‘ ఈ వ్యక్తులకు ఒక ఆఫర్ ఉందని నాకు తెలుసు. ఇది ఏ రకమైన 'కెమికల్ లోచా' (అసమతుల్యత) అని నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తులు ఎవరితో చెలగాటమాడారనేది నాకు తెలియదు ’’ అని ఆయన అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రస్తావిస్తూ.. మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియడం లేదని అన్నారు. కాగా ఉద్ద‌వ్ ఠాక్రే ఈ వ్యాఖ్య‌లు చేయ‌గానే అక్క‌డున్న జ‌నం ‘దేశ ద్రోహులు‘ అంటూ నినాదాలు చేశారు. త‌రువాత ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ ఇది వారి తలపై ఉన్న ముద్ర. వారు ఎక్కడికి వెళ్లినా దానిని తమతో పాటు మోసుకెళ్లాల్సి ఉంటుంది. తమ చర్యలతోనే దీనిని సంపాదించారు. వారు ప్రజాప్రతినిధులు అయినప్పటికీ, వారు కేంద్ర ప్రభుత్వ రక్షణతో తిరుగుతున్నారు. ’’ అని అన్నారు. 

అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ.. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము..

సేన సామాన్య ప్రజలను అసాధారణ వ్యక్తులుగా మార్చిందని అన్నారు. ఇప్పుడు కొత్త శివసేన కార్యకర్తలతో దానిని పునరావృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. కాగా గత నెలలో సేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే, 39 మంది ఇతర ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. జూన్ 30వ తేదీన షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !