అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేశారు - కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్

Published : Jun 14, 2023, 09:54 AM IST
అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేశారు - కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్

సారాంశం

భారత ప్రభుత్వం ట్విట్టర్ పై ఒత్తిడి తెచ్చిందని, అందుకే రాహుల్ గాంధీ అకౌంట్ ను బ్యాన్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. 

రైతుల నిరసనలను కవర్ చేసే ఖాతాలను బ్లాక్ చేయడానికి భారతదేశం నుండి 'ఒత్తిడి' వచ్చిందని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన వ్యాఖ్యల దేశ వ్యాప్తంగా రాజకీయ రగడను నెలకొల్పింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ స్పందించారు.

హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థులపై ఒత్తిడి.. స్కూల్ బిల్డింగ్ ను కూల్చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం

‘‘ట్విట్టర్ సీఈఓ ప్రకటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, మూసేయాలని ప్రభుత్వ యంత్రాంగమంతా ట్విటర్ సీఈవోపై ఒత్తిడి తెచ్చింది. అందుకే వారు రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను నిషేధించారు’’ అని వేణుగోపాల్ అన్నారు. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఎక్కడుంది ? వైఫల్యాన్ని అణచివేసేందుకు ఇలా చేస్తారు. పార్లమెంటులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని లేవనెత్తుతాం’’ అని అన్నారు. 

ఇద్దరు చిన్నారులపై ముగ్గురు మైనర్ల లైంగిక వేధింపులు.. పైగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసి..

కాగా రైతుల నిరసనలను కవర్ చేసే ఖాతాలను బ్లాక్ చేయడానికి భారత్ ఒత్తిడి చేసిందని జాక్ డోర్సే చేసిన వాదనను మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే కూడా సమర్థించారు. ‘‘ట్విట్టర్ సీఈఓ (జాక్ డోర్సీ) చెప్పింది పూర్తిగా కరెక్టే. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాలు చూపించే అధికారం మీడియాకు ఇవ్వలేదు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల చేయగా వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. అవును.. వారికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేస్తే, భారతదేశంలో ట్విట్టర్ విభాగాలపై దాడి చేస్తాము అని ప్రభుత్వం ట్విట్టర్ ను హెచ్చరించి ఉంటుంది’’ అని అన్నారు.  ‘‘బీజేపీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని తెలుసు. ట్విట్టర్ అబద్ధాలు చెప్పడం లేదు. కానీ ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. వారు కేంద్ర సంస్థలను (ట్విట్టర్, బీబీసీ కోసం) ఉపయోగించి ఉండాలి’’ అని పటోలే అన్నారు.

పెళ్లి కొడుకా మజాకా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపు.. వీడియో వైరల్..  

గత ఏడాది ట్విట్టర్ బోర్డు నుంచి వైదొలిగిన డోర్సీ సోమవారం ‘బ్రేకింగ్ పాయింట్స్ విత్ క్రిస్టల్ అండ్ సాగర్’అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వం ట్విట్టర్ పై ఒత్తిడి తెచ్చిందని, భారత్ లో కంపెనీని మూసివేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని హెచ్చరించిందని అందులో ఆరోపించారు. ‘‘... రైతుల నిరసనల చుట్టూ అనేక అభ్యర్థనలు వచ్చిన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరు పాత్రికేయుల అకౌంట్ లను బ్లాక్ చేయాలని, లేకపోతే భారత్ లో ట్విట్టర్ ను మూసివేస్తామని హెచ్చరించారు. భారతదేశం మాకు పెద్ద మార్కెట్. కానీ వారు చెప్పినట్టు చేయకపోతే మా ఉద్యోగుల ఇళ్లపై దాడి చేస్తాం. ఆఫీసులు మూసివేస్తాం అని అన్నారు. ఇదీ భారతదేశం. ప్రజాస్వామ్య దేశం’’ అని ఆయన అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్