భారతీయులందరినీ సంతోషంతో ముంచెత్తినందుకు ధన్యవాదాలు : ఆర్ఆర్ఆర్ టీమ్ కు వెంకయ్య నాయుడు, ఖర్గే అభినంద‌న‌లు

Published : Mar 13, 2023, 11:58 AM IST
భారతీయులందరినీ సంతోషంతో ముంచెత్తినందుకు ధన్యవాదాలు : ఆర్ఆర్ఆర్ టీమ్ కు వెంకయ్య నాయుడు,  ఖర్గే అభినంద‌న‌లు

సారాంశం

Oscars: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని "నాటు నాటు" పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు ప్రకటన రాగానే అక్కడ ఉన్న రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు. భార‌తీయ చిత్రం ఆస్కారు గెల‌వ‌డంతో ఆర్ఆర్ఆర్ టీమ్ అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.   

Naatu Naatu wins Oscar: 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే అభినంద‌న‌లు తెలిపారు.

 

 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని "నాటు నాటు" పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. ది అవార్డ్ గోస్ టు 'నాటు నాటు' అని చెప్పగానే అక్కడ ఉన్న రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు. భార‌తీయ చిత్రం ఆస్కారు గెల‌వ‌డంతో ఆర్ఆర్ఆర్ టీమ్ అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఆర్ఆర్ఆర్ టీంకు వెంకయ్య ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆస్కార్ అవార్డు గెలుచుకుని చ‌రిత్ర సృష్టించిన సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌలి, చిత్ర బృందానికి అభినంద‌న‌లు అని వెంక‌య్య ట్వీట్ చేశారు.

 

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని #NaatuNaatu ఉత్తమ ఒరిజినల్ పాట‌గా  #Oscar గెలుచుకోవడం పట్ల లక్షలాది మంది భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఇంత ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్'' అన్నారు. రిహన్నా, లేడీ గాగా వంటి  ప్ర‌ముఖుల పాట‌ల‌ను వెన‌క్కినెట్టి 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. చిత్రబృందం తరఫున సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవతో పాటు దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఆస్కార్ లో 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో నామినేట్ అయిన తొలి తెలుగు పాట 'నాటు నాటు. ఆస్కార్ ఆవార్డు ద‌క్కించుకుని స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. ఈ జనవరిలో గోల్డెన్ గ్లోబ్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు' అవార్డు గెలుచుకుంది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?