జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. ఓ సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది.
కాశ్మీర్ లో దారుణం జరిగింది. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని రఖ్-ఏ-చిద్రెన్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఒక పౌరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
Another civilian shot at by terrorists in Kashmir.. This bloody dance of death by Pák sponsored terrorists is a testimony that Pàkistan is no crusader of Kashmiris but creator of mayhem in Kashmir
Terrorists fired at the civilian in Rakh-e-Chidren village of district. pic.twitter.com/FPsYGsWYdf
బాధితుడిని షోపియాన్‌లోని కీగామ్ ప్రాంతంలోని రఖ్-ఎ-చిద్రెన్‌కు చెందిన గులాం నబీ షేక్ కుమారుడు ఫరూక్ అహ్మద్ షేక్ గా పోలీసులు గుర్తించారు. అతడిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. గాయాలపాలైన ఫరూఖ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతడి కాలికి గాయమైందని, ఆసుపత్రిలో చేర్చామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. దాడి జరిగిన వెంటనే దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
| Civilian shot at by terrorists in , shifted to hospital.
He is stable now.
Terrorists attacking poor innocent, unarmed civilians, just to prove their cowardice only!! pic.twitter.com/QXW8xtIEl4
దాడి సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కాగా అంతకు ముందు కుల్గామ్‌లో ఉగ్రవాదుల బుల్లెట్‌లకు గురైన ఉపాధ్యాయుడు రజనీ బాలా అంత్యక్రియలను ఈ రోజు సాంబాలోని నానక్ చక్‌లో దహనం చేశారు. రజనీ బాలా హత్య తర్వాత లోయ, జమ్మూ ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జమ్మూలో బుధవారం నాడు వివిధ సంస్థలు టార్గెట్ హత్యలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాయి. అదే సమయంలో, లోయలోని కాశ్మీరీ పండిట్లు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి మంగళవారం 24 గంటల అల్టిమేటం ఇచ్చారు.