Terrorists Shoot Dead TV Artiste: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కాల్పులు.. టీవీ నటి మృతి.. బంధువుకు గాయాలు..!

Published : May 26, 2022, 02:37 AM IST
Terrorists Shoot Dead TV Artiste:  జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కాల్పులు..  టీవీ నటి మృతి.. బంధువుకు గాయాలు..!

సారాంశం

Terrorists Shoot Dead TV Artiste: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలారేగిపోయారు. తాజాగా బూద్గామ్‌ జిల్లాలో టీవీ నటి అమ్రీన్‌ భట్‌ (35)ను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  

Terrorists Shoot Dead TV Artiste:  జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర మూక దారుణాలు శృతిమించిపోతున్నాయి. ఇష్టానూసారంగా ఉగ్ర‌ వాదులు చెలారేగిపోతున్నారు. కొన్ని రోజులుగా బరితెగించి బహిరంగంగా ఇళ్లపైనే పడి కాల్పులకు పాల్ప‌డుతున్నారు. నిత్యంలో ఏదొక చోట భయోత్పాతం సృష్టిస్తున్నారు. గ‌త 24గంటల వ్యవధిలోనే కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా బూద్గామ్‌ జిల్లాలో టీవీ నటి అమ్రీన్‌ భట్‌ (35)ను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు గాయపడ్డాడు.

 బుధవారం హిష్రు చదూరా గ్రామంలో ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈ క్రమంలో ప్రఖ్యాత టీవీ నటుడు అంబ్రీన్ భట్, ఆమె మేనల్లుడుపై  కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దాడిలో అబ్రీన్, ఆమె 10 ఏళ్ల మేనల్లుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. అంబ్రీన్ మ‌ర‌ణించ‌గా, ఆమె మేనల్లుడు ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. బాలుడి చేతికి తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.  ఇది నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు. ముష్కరుల్ని పట్టుకొనేందుకు ముమ్మరంగా గాలింపు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కేసుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఈ దార‌ణం తెలిసిన వెంట‌నే..  గుప్కర్ కూటమి ఆమె మృతికి సంతాపం తెలిపింది. మైక్రోబ్లాగింగ్ సైట్, ట్విటర్‌లో, ఒమర్ అబ్దుల్లా ఆంబ్రీన్ భట్‌పై జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడితో తాను ఎంత 'దిగ్భ్రాంతి చెందామ‌ని  
 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!