ఉగ్రవాదుల పని: 9 మంది పోలీసు కుటుంబాల సభ్యుల కిడ్నాప్

By pratap reddyFirst Published Aug 31, 2018, 8:48 AM IST
Highlights

కాశ్మీరులో ఉగ్రవాదులు విజృంభించారు. జమ్మూ కాశ్మీరులో పనిచేస్తున్న పోలీసు, సైనికుల కుటుంబాలకు చెందిన 9 మందిని కిడ్నాప్ చేశారు. 24 గంటల్లో వారు ఈ అపహరణలకు పాల్పడ్డారు. 

శ్రీనగర్: కాశ్మీరులో ఉగ్రవాదులు విజృంభించారు. జమ్మూ కాశ్మీరులో పనిచేస్తున్న పోలీసు, సైనికుల కుటుంబాలకు చెందిన 9 మందిని కిడ్నాప్ చేశారు. 24 గంటల్లో వారు ఈ అపహరణలకు పాల్పడ్డారు. 

సోపియాన్, కుల్గామ్, అనంతనాగ్, అవంతిపురల్లో గురువారం రాత్రి ఉగ్రవాదులు ఆ చర్యకు దిగారు. కిడ్నాప్ చేసిన వారిని వదలిపెట్టాలని సంబంధిత కుటుంబ సభ్యులు ఉగ్రవాదులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

కీడ్నాపైనవారు వీరే..... జుబైర్ అహ్మద్ భట్ (అవామికి చెందిన పోలీసు మొహమద్ మఖ్బూల్ భట్ కుమారుడు), అరిఫ్ అహ్మద్ శంకర్ (అర్వానీ బిబెహరా నివాసి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ శంకర్), ఫైజాన్ అహ్మద్ మక్రో (ఖార్పోరా కుల్గామ్ నివాసి, పోలీసు బషీర్ అహ్మద్ మక్రో సోదరుడు), సుమర్ అహ్మద్ రాథేర్ (యామ్రాచ్ యారిపొరా కుల్గామ్ నివాసి, పోలీసు అబ్దుల్ సలామ్ రాథేర్ కుమారుడు), గౌవ్హేర్ అహ్మద్ మాలిక్ (కాటపొరా నివాసి, డిఎస్పీ ఐజాజ్ సోదరుడు), యాసిర్ అహ్మద్ భట్ (ఎఎస్ఐ కుమారుడు).

మరో ఇద్దరిని మిందోరకు చెందిన నసీర్ అహ్మద్, కంగన్ ట్రాల్ కు చెందిన షబీర్ అహ్మద్ జర్గార్ లుగా గుర్తించారు. పింగ్లిష్ ట్రాల్ నుంచి ఆసిఫ్ అహ్మద్ రాథేర్ ను కూడా కిడ్నాప్ చేశారు. అతను పోలీసు రఫీక్ అహ్మద్ రాథేర్ కుమారుడిగా గురించారు.

భద్రతా బలగాలు పెద్ద యెత్తున దాడులు నిర్వహించి కొంత మంది ఉగ్రవాదులకు చెందిన కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కిడ్నాప్ సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.  

click me!