జ‌మ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్‌ కిడ్నాప్ - ఉగ్ర‌వాదుల కోసం సెర్ఛ్ ఆప‌రేష‌న్

Published : Oct 08, 2024, 11:25 PM ISTUpdated : Oct 08, 2024, 11:35 PM IST
జ‌మ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్‌ కిడ్నాప్ - ఉగ్ర‌వాదుల కోసం సెర్ఛ్ ఆప‌రేష‌న్

సారాంశం

Terrorists abduct Territorial Army jawan: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కాకర్‌నాగ్ ప్రాంతం నుంచి టెరిటోరియల్ ఆర్మీ జవాన్‌ను ఉగ్రవాదులు మంగళవారం కిడ్నాప్ చేశారు. ఇదే స‌మ‌యంలో మరో జవాన్ వారి నుంచి తప్పించుకోగలిగాడు.  

Terrorists abduct Territorial Army jawan : దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలోని షాంగస్ నుంచి ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) జవాన్‌ను మిలిటెంట్లు అపహరించారు. స్థానిక మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. మరో టిఎ జవాన్ ఈ కిడ్నాప్ నుంచి తప్పించుకోగలిగాడు. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది, తప్పిపోయిన సైనికుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాలను శోధిస్తోంది. 

జవాన్ అపహరణతో భారత సైన్యం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. తప్పిపోయిన జవాన్‌పై ఏమైనా లీడ్స్ కోసం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా వెతకడం ప్రారంభించారు. 

 

 

పూంచ్‌లో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న భార‌త‌ ఆర్మీ 

మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని జుల్లాస్ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన రోమియో ఫోర్స్ భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పక్కా సమాచారం ఆధారంగా అన్వేషణ ప్రారంభించారు. అనుమానిత ఉగ్రవాద బ్యాగ్ నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఏకే 47, పిస్టల్ రౌండ్‌లు, ఆర్‌సీఐఈడీ, టైమ్డ్ డిస్ట్రాంగ్ ఐఈడీ, స్టవ్ ఐఈడీ వంటి అధునాతన పేలుడు పదార్థాలు, ఐఈడీ పేలుడు పదార్థాలు, చైనీస్ గ్రెనేడ్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. "అక్టోబర్ 5న విశ్వసనీయ స‌మాచారం ఆధారంగా జూలాస్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన రోమియో ఫోర్స్ భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అక్కడ జరిపిన శోధనలో భారీ మొత్తంలో AK 47, పాకిస్థానీ పిస్టల్ రౌండ్‌లతో కూడిన అనుమానిత ఉగ్రవాద సంచి ఉంది. అందులో RCIED, టైమ్డ్ డిస్ట్రాషన్ IED, స్టవ్ IED వంటి అధునాతన పేలుడు పదార్థాలు, IED కోసం పేలుడు పదార్థాలు, చైనీస్ గ్రెనేడ్‌లు ఉన్నాయి" అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Best Airport in India : ఇండియాలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్.. వరుసగా 7వ సారి టాప్.. ముంబై బెంగళూరు కాదు !
Cyber Crime : ఇక సైబర్ నేరాలకు చెక్.. రంగంలోకి స్పెషల్ పోలీసులు