భారీమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం.. ఎక్క‌డంటే..?

Published : Sep 19, 2022, 01:14 AM IST
భారీమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం.. ఎక్క‌డంటే..?

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఓ ఉగ్రవాద స్థావరాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేధించాయి. ఈ క్ర‌మంలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  

జ‌మ్మూ కాశ్మీర్ లో నానాటికీ ఉగ్ర కార్య‌క‌లాపాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. వాటిని నిలువ‌రించేందుకు భ‌ద్ర‌త బలాగాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయినా ఎక్క‌డో ఓ చోట ఉగ్ర కార్య‌కలాపాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భ‌ద్ర‌త బ‌లగాలు చేధించాయి. ఆ స్థావ‌రంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూ పోలీసులు మీడియాకు తెలిపారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుల్ సబ్ డివిజన్‌లోని సంగల్దాన్‌లోని టెత్రకా అటవీ ప్రాంతంలో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ఓ సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరం కనుగొనబడింది. ఆ స్థావరంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్, చైనీస్ పిస్టల్‌తో పాటు 36 రౌండ్ల మ్యాగజైన్, ఒక కత్తి, నాలుగు మ్యాగజైన్‌లు, ఏకే-47 రైఫిల్‌కు చెందిన 198 కాట్రిడ్జ్‌లు, తొమ్మిది ఎంఎం పిస్టళ్ళు, వాటికి సంబంధించిన 69 కాట్రిడ్జ్‌లు, టెలిస్కోప్, కెమెరా, వైర్‌లెస్ సెట్ ఉన్నాయి. 

ఈ నెల ప్రారంభంలో కూడా గూల్‌కు ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం యొక్క 42 రాష్ట్రీయ రైఫిల్స్ (RR) జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా త్రాల్‌లోని సయ్యదాబాద్ పస్తునా అటవీ ప్రాంతంలో ఒక ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. ఆ స్థావ‌రంలో నిషేధిత సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు సంబంధించిన నేరాధారాలను కనుగొన్నారు. అలాగే ఆ స్థావ‌రంలో మందుగుండు సామాగ్రితో స‌హా ఆహార ప‌దార్థాలు, వంట పాత్రలు మొదలైన వాటిని  స్వాధీనం చేసుకున్నారు.  

ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 నుండి  ఇప్ప‌టి వ‌ర‌కూ కాశ్మీర్‌లో 500 మందికి పైగా ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని కాశ్మీర్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 80కి పైగా ప్రదేశాలలో. దాడులు నిర్వహించడమే కాకుండా పలు ఆస్తులను కూడా అటాచ్ చేశారు. శ్రీనగర్‌లో 10కి పైగా ఆస్తులను జప్తు చేసిన‌ట్టు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?