వివాహితతో అక్రమ సంబంధం.. యువకుడిని సుత్తితో కొట్టి..!

Published : Sep 14, 2021, 10:16 AM IST
వివాహితతో అక్రమ సంబంధం.. యువకుడిని సుత్తితో కొట్టి..!

సారాంశం

వారు ఇంటి నుంచి పరారయ్యారు.  అయితే.. వారి ఇద్దరి కుటుంబాలతో మాట్లాడి రాజీ చేసుకున్న తర్వాత..వారిద్దరూ ఇంటికి వచ్చారు.  


ఓ 22ఏళ్ల యువకుడు ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఆమెతో కలిసి పరారయ్యాడు. దీంతో.. సదరు యువకుడిని..  మహిళ కుటుంబసభ్యులు దారుణంగా హింసించి మరీ కొట్టారు. సుత్తితో పట్టుకొని మరీ.. అతి దారుణంగా కొట్టారు. పట్టపగలు అందరూ చూస్తుండగా..  అతనిపై దాడి చేయడం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని పుష్పక్ భవసర్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారు ఇంటి నుంచి పరారయ్యారు.  అయితే.. వారి ఇద్దరి కుటుంబాలతో మాట్లాడి రాజీ చేసుకున్న తర్వాత..వారిద్దరూ ఇంటికి వచ్చారు.

 

ఈ ఘటనలో సదరు యువకుడిపై  మహిళ తండ్రి, సోదరుడు.. చాలా కక్ష పెంచుకున్నారు. యవకుడి కారణంగా తమ పరువు పోయిందని భావించారు. ఈక్రమంలో ఆదివారం సదరు యువకుడు వారికి మార్కెట్లో కనిపించాడు. దీంతో.. అతనిపై దాడి చేశారు. సుత్తితో దారుణంగా కొట్టడం గమనార్హం.

కాగా.. దీనికి సంబంధించిన వీడియో.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో.. యువకుడిపై జరుగుతున్న దాడిని ఆపకపోగా.. దానిని వీడియోలు తీయడం గమనార్హం.  వీడియోలో చూపించిన దాని ప్రకారం యువకుడి చేతులు, కాళ్ల పై సుత్తితో దాడి చేయడం గమనార్హం. వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌