గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోల మృతి, పలువురికి గాయాలు?

By narsimha lodeFirst Published Apr 28, 2021, 9:51 AM IST
Highlights

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం నాడు పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరికొందరు గాయపడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం నాడు పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరికొందరు గాయపడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. గడ్చిరోలి జిల్లాలో ఇవాళ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో  ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్టుగా సమాచారం. 

గత మాసంలో  ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లో  24 మంది జవాన్లు మృతి చెందారు. ఐదు రోజుల పాటు  కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు తమ ఆధీనంలో ఉంచుకొన్నారు.  మీడియాప్రతినిధులు, ప్రజా సంఘాల సభ్యుల చర్చల నేపథ్యంలో  ప్రజాకోర్టులో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు వదిలిపెట్టారు. 

ఛత్తీస్‌ఘడ్ తో పాటు  మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో మావోయిస్టులను అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే గతంలో మాదిరిగా రిక్రూట్ మెంట్ లేకపోవడంతో పార్టీ బలహీనపడిందని ఇటీవలనే ఏపీ డీజీపీ ముందు లొంగిపోయిన ఏఓబీ సభ్యుడు జలంధర్ రెడ్డి  ప్రకటించారు. 

click me!