రామేశ్వరంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు: రాత్రికి హైదరాబాద్‌కి

Siva Kodati |  
Published : May 10, 2019, 04:29 PM IST
రామేశ్వరంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు: రాత్రికి హైదరాబాద్‌కి

సారాంశం

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రామేశ్వరంలోని ప్రఖ్యాత రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రామేశ్వరంలోని ప్రఖ్యాత రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబసభ్యులతో కలిసి రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రికి... ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి దర్శనం చేయించి.. తీర్ధప్రసాదాలు అందజేశారు. రామేశ్వరానికి సమీపంలోనే ఉన్న ధనుష్కోటీ, రామసేతు, పంచముఖ హనుమాన్ దేవాలయాలను సీఎం ఫ్యామిలీ దర్శించుకుంది.

కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, కుమారుడు కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తమిళనాడు పర్యటనను ముగించుకుని గురువారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?