మోడీకి మాయావతి కౌంటర్

Published : May 10, 2019, 03:07 PM IST
మోడీకి మాయావతి కౌంటర్

సారాంశం

ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు ఎన్నికల ప్రచారంలో  బీజేపీ నేతలు ఉపయోగిస్తున్న భాషను చూస్తే ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకొందని ఆమె ఎద్దేవా చేశారు.

లక్నో:  ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు ఎన్నికల ప్రచారంలో  బీజేపీ నేతలు ఉపయోగిస్తున్న భాషను చూస్తే ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకొందని ఆమె ఎద్దేవా చేశారు.

ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందించారు.  రెండో దఫా ప్రధాని కావాలనే మోడీ కోరిక తీరదని ఆమె చెప్పారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ నేతలు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మాయావతి అభిప్రాయపడ్డారు. యూపీలో బీఎస్పీ, ఎస్పీలు కుల ప్రాతిపదికన ఏర్పడిన కూటమి అంటూ మోడీ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై మాయావతి స్పందించారు.

తమ కూటమి కులం ఆధారంగా ఏర్పడిందనటం, కుల రాజకీయాలు చేస్తుందనడం హాస్యాస్పదం. అవివేకమన్నారు. . కులం పేరిట జరిగే ఏ బాధను ఆయన అనుభవించలేదన్నారు. కళ్యాణ్ సింగ్ వంటి నేతలను ఆర్‌ఎస్ఎస్ ఏం చేసిందో తెలిసిందేనని ఆమె ఎద్దేవా చేశారు. 

 ఇలాంటి అనవసరపు విమర్శలు చేసే బదులు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో దళితుల పరిస్థితి ఎలా ఉందో ఓసారి తెలుసుకుంటే మంచిదని మోదీకి హితవు పలికారు. గుజరాత్‌లో దళితులపై అత్యాచారాలు పెచ్చుమీరాయని.. వీటి గురించి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?