
కర్ణాటక : బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న గూగుల్ టెక్కీ, ఓ యువతితో స్నేహం చేసి ఆమె కుటుంబ సభ్యుల చేతిలో బందీ అయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. గూగుల్ ఇండియా సీనియర్ మేనేజర్, మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన గణేష్ శంకర్, షిల్లాంగ్ ఐఐఎంలో ఎంబీఏ చదువుతున్న సమయంలో భోపాల్ కు చెందిన సుజాత అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఐదేళ్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆ యువతిని కలవడానికి ఓ రోజు గణేష్ శంకర్ భోపాల్ కి వెళ్లాడు.
అక్కడ గణేష్ శంకర్ కు ఆ యువతి కుటుంబ సభ్యులు బాగా మర్యాదలు చేశారు. ఆ తర్వాత అతడికి మత్తు ఒచ్చే మందును ఇచ్చారు. దీంతో అతను స్పృహ తప్పగానే ఓ చీకటి గదిలో బంధించారు. ఆ తర్వాత గణేష్ శంకర్ ను బెదిరించి, యువతితో బలవంతంగా పెళ్లి చేశారు. దాన్నంతా ఫోటోలు తీశారు. ఆ తరువాత అవి చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. రూ.40 లక్షలు ఇవ్వాలని, లేదంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. ఎలాగో వారినుంచి తప్పించుకున్న గణేష్, భోపాల్ లోని కమలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ లో బుడ్డోడు.. వీడియో వైరల్...
పోలీసులు యువతి సుజాతతో పాటు మరో ముగ్గురు.. యువతి తండ్రి కమలేశ్ సింగ్, సోదరుడు శైవేష్ సింగ్, విజయేంద్ర కుమార్ లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గణేష్ శంకర్ కూడా వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు సుజాత కుటుంబ సభ్యులు తమకు తెలిపారని, గణేష్ ద్వారా తాము మోసపోయామని వారు బెంగళూరులో ఫిర్యాదు చేశారని భోపాల్ కమలానగర్ పోలీస్ అధికారి అనిల్ కుమార్ వాజ్ పేయి తెలిపారు.