Tejashwi Yadav: అప్ప‌టి నుంచే ఆమెను ప్రేమించాను.. లవ్‌స్టోరిని రివీల్‌ చేసిన డిప్యూటీ సీఎం 

By Rajesh KFirst Published Aug 12, 2022, 11:11 PM IST
Highlights

Tejashwi Yadav: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో జ‌రిగిన పలు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న ల‌వ్ స్టోరిని రీలివ్ చేశారు.  
 

Tejashwi Yadav: బీహార్‌లో అనూహ్య పరిస్థితుల త‌రువాత .. కాంగ్రెస్‌, ఆర్జేడీ సపోర్టుతో నితీష్‌ కుమార్ నూత‌న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తేజస్వీ యాదవ్ ఓ ప్ర‌ముఖ చానెల్ నిర్వ‌హించిన ఇంటర్వ్యూలో తన వ్య‌క్తిగ‌త జీవితంలోని ప‌లు ఆస్త‌కిక‌ర విషయాలను వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో త‌న టీనేజ్ అండ్ స‌క్సెస్ పుల్ ల‌వ్ సోర్టీని  రిలీవ్ చేశారు. తన భార్య రాచెల్‌ గొడిన్హో(రాజ్ శ్రీ)తో సాగించిన ప్రేమాయ‌ణం గురించి.. ప‌లు ఆసక్తికర విషయాలు వెల్ల‌డించారు. తమది లవ్ అండ్ అరేంజ్డ్‌ మ్యారేజ్ అని చెప్పుకోచ్చారు. ఈ ఇంట‌ర్య్వూలో తేజస్వి యాదవ్ తన భార్యపై చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతోంది.
 
త‌న ల‌వ్ సోర్టీని మొద‌ట‌ త‌న తండ్రి (లాలు ప్రసాద్ యాద‌వ్)కి చెప్పాన‌నీ, రాచెల్ తో గ‌త కొన్నేండ్లుగా  డేటింగ్ చేస్తున్నాననీ,  ఆమెనే పెండ్లి చేసుకోవాలని త‌న తండ్రికి చెప్పాన‌ని అన్నారు. అందుకు  లాల్ ప్రసాద్ ఎలాంటి అభ్యంత‌రాలు చెప్ప‌కుండా.. ఓకే చెప్పాడ‌నీ తెలిపారు. అయితే.. రాచెల్ క్రిస్టియ‌న్ అని చెప్పితే.. త‌న తండ్రి అది స‌మ‌స్యే కాద‌నీ,  వెంటనే.. త‌న పెళ్లికి సరే అన్నాడ‌నీ, సమస్య లేదని అంగీకారం తెలిపాడ‌ని చెప్పుకోచ్చారు. 

రాచెల్ హర్యానాలోని రేవారీకి చెందినది. అయితే.. ఆమె చిన్నతనంలోనే త‌న కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చేసింది. ఆమె ఢిల్లీలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ మేట్‌ అని.. ఇద్దరి మధ్య ఏడేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిచిందని తెలిపారు. ఇంకో ఆస‌క్తి క‌ర‌మైన విష‌యమేమిటంటే.. రాచెల్ గోడిన్హో తండ్రి ఢిల్లీలోని పాఠశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. రాచెల్ త‌ల్లి పౌర విమానయాన పరిశ్రమలో క్యాబిన్ సిబ్బందిగా పనిచేశారు. ఇక, తమ పెళ్లి తర్వాత రాచెల్‌ హిందుత్వంలోకి మారిందని.. అప్పుడే తన పేరును రాజ్ శ్రీగా మార్చుకుందని జాతీయ మీడియాలో కథనాల్లో పేర్కొన్నారు. 

గతేడాది న్యూఢిల్లీలో జరిగిన వివాహానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 50 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు వివాహానికి హాజరయ్యారు. తొమ్మిది మంది తోబుట్టువుల్లో తేజస్వి చిన్నవాడు. అత‌నికి ఏడుగురు సోదరీమణులు మరియు ఒక అన్నయ్య తేజ్ ప్రతాప్ ఉన్నారు.
 

click me!