బాలికను అత్యాచారం నుంచి కాపాడిన క్రికెట్

Published : Jul 06, 2019, 02:20 PM IST
బాలికను అత్యాచారం నుంచి కాపాడిన క్రికెట్

సారాంశం

మనీశ్‌(15), అమిత్‌(18), రోహిత్‌(18), బాదల్‌(14) అనే నలుగురు యువకులు గురువారం క్రికెట్‌ ఆడుతుండగా వారికి ఆ సమయంలో ఓ బాలిక అరుపులు వినిపించాయి. అరుపులు వినిపించిన దిశగా వెళ్లి చూశారు.

జైపూర్‌: యువకుల క్రికెట్ క్రీడ ఓ బాలికను అత్యాచార ఘోరం నుంచి కాపాడింది. ఆ బాలికను కాపాడిన నలుగురు యువకులకు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. 

మనీశ్‌(15), అమిత్‌(18), రోహిత్‌(18), బాదల్‌(14) అనే నలుగురు యువకులు గురువారం క్రికెట్‌ ఆడుతుండగా వారికి ఆ సమయంలో ఓ బాలిక అరుపులు వినిపించాయి. అరుపులు వినిపించిన దిశగా వెళ్లి చూశారు. అక్కడ ఓ చిన్న కొండ వద్ద ఓ వ్యక్తి బాలికను అత్యాచారం చేసేందుకు దుండగుడు ప్రయత్నిస్తున్నాడు. 

దాంతో ఆ నలుగురు యువకులు ఒక్కసారిగా అతడిపై పడి అతన్ి బంధించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. యువకులు చూపిన తెగువ, ధైర్యసహసాలను అడిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ బీకే సోని ప్రశంసించారు. 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే