విజ‌య‌వంతమైన‌ ఆప‌రేష‌న్ కావేరీ: సూడాన్ నుంచి 3800 మంది ఇండియ‌న్స్ ను రక్షించిన భార‌త్

Published : May 06, 2023, 01:01 AM IST
విజ‌య‌వంతమైన‌ ఆప‌రేష‌న్ కావేరీ: సూడాన్ నుంచి 3800 మంది ఇండియ‌న్స్ ను రక్షించిన భార‌త్

సారాంశం

Operation Kaveri: భారత్ ఆపరేషన్ కావేరిని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. పోర్ట్ సూడాన్ నుంచి తరలించడానికి భారతీయులు ఎవరూ వేచి లేరని సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సైన్యం, పారామిలటరీ దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే ఆ దేశంలో 500 మందికి పైగా మృతి చెందారు. ఈ క్ర‌మంలోనే సూడాన్ లో చిక్కుకున్న దాదాపు 3,800 మంది భారతీయులను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది ప్ర‌భుత్వం.  

India wraps up Operation Kaveri: ఘ‌ర్ష‌ణ‌ సంక్షోభంలో ఉన్న సూడాన్ లో చిక్కుకున్న భార‌తీయ‌ల‌ను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ కావేరిని ప్రారంభించింది. భారత్ ఆపరేషన్ కావేరిని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. పోర్ట్ సూడాన్ నుంచి తరలించడానికి భారతీయులు ఎవరూ వేచి లేరని సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సైన్యం, పారామిలటరీ దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే ఆ దేశంలో 500 మందికి పైగా మృతి చెందారు. ఈ క్ర‌మంలోనే సూడాన్ లో చిక్కుకున్న దాదాపు 3,800 మంది భారతీయులను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది ప్ర‌భుత్వం.

పోర్ట్ సూడాన్ లో భారతీయులెవరూ నిరీక్షించలేదని సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. సంక్షోభంలో చిక్కుకున్న సుడాన్ నుంచి చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు భారత్ ఏప్రిల్ 24న ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. భారత వైమానిక దళ విమానాలు, భారత నౌకాద‌ళానికి చెందిన నౌకల ద్వారా సూడాన్ నుంచి ఇప్పటివరకు దాదాపు 3,800 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది.

 

 

సూడాన్ ఎందుకు ఘ‌ర్ష‌ణ‌ల‌తో అట్టుడుకుతోంది..? 

ఏప్రిల్ 15న మహ్మద్ హమ్దాన్ దగాలో నేతృత్వంలోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్), లెఫ్టినెంట్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ అల్-బుర్హాన్ నేతృత్వంలోని సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరగడంతో సూడాన్  సంక్షోభం ప్రారంభమైంది. ఇరువ‌ర్గాలు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్ర‌మంలోనే చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో కనీసం 528 మంది మరణించగా, మరో 1,800 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ప‌రిస్థితులు దారుణంగానే ఉన్నాయి. 

భారత్ ఆపరేషన్ కావేరి..

2024 ఏప్రిల్లో భారత వైమానిక దళం, భారత నౌకాదళం సంయుక్తంగా సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ కావేరిని ప్రారంభించాయి. తొలుత భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన రెండు సీ130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డా వద్ద, భారత నౌకాదళం పోర్ట్ సూడాన్ లో ఐఎన్ఎస్ సుమేధను మోహరించాయి. ఆ తర్వాత భారతీయులను రక్షించేందుకు ఐఏఎఫ్ సీ17 గ్లోబ్ మాస్టర్ విమానాలను కూడా ఉపయోగించింది. ఇప్పటి వరకు ఐదు నౌకాదళ నౌకలు, 17 వైమానిక దళ విమానాలను ఉపయోగించి భారతీయులు సురక్షితంగా త‌ర‌లించారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్