మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. 12 గంటలకు పైగా నిర్భంధించి దారుణం.. 8 మంది అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Dec 18, 2022, 3:21 PM IST
Highlights

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఒక గ్రామంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఒక గ్రామంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం- శనివారం మధ్య రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. దాదాపు 12 గంటలకు పైగా బాలికను వారి ఆధీనంలో ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. నిందితులు బాధిత బాలికను సముద్ర తీరానికి తీసుకెళ్లే ముందు వారి బీచ్ గ్రామంలోని ఖాళీ బంగ్లాలో అత్యాచారం చేసి.. తర్వాత సముద్ర తీరంలో కూడా మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసు అధికారి ఒకరు  తెలిపారు. మొత్తం ఎనిమిది మంది నిందితులపై సత్పతి పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కింద కేసు నమోదైందని చెప్పారు. 

పాల్ఘర్ జిల్లా గ్రామీణ పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. బాధితురాలికి సుమారు 16 ఏళ్లు ఉంటాయని తెలిపారు. ‘‘బాధిత బాలిక శనివారం దాఖలు చేసిన ఫిర్యాదులో..  తనపై డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు సామూహిక అత్యాచారం కొనసాగిందని తెలిపారు. ఆ సమయంలో నిందితులు తనను మహీమ్ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాకు తీసుకెళ్లారని.. అక్కడ వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. తరువాత వారు ఆమెను సముద్ర తీరానికి తీసుకెళ్లారు.. అక్కడ వారు మళ్లీ పొదల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు’’ అని ఆయన చెప్పారు. 

బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారిపై 376 (డి) (గ్యాంగ్ రేప్), 366 (ఏ) (మైనర్ బాలికను ఎత్తుకెళ్లడం), 341 (తప్పుగా నిర్బంధించడం) సహా ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

click me!