పీజీ చేసి ఫుడ్ డెలివరీ బాయ్ గా.. కస్టమర్ ఏం చేశాడంటే..

By ramya NFirst Published Feb 13, 2019, 12:25 PM IST
Highlights

పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి.. ఓ యువకుడు సరైన ఉద్యోగం దొరకక.. ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. అతని  వివరాలు తెలుసుకున్న కస్టమర్ షాకింగ్ కి గురయ్యాడు. 


పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి.. ఓ యువకుడు సరైన ఉద్యోగం దొరకక.. ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. అతని  వివరాలు తెలుసుకున్న కస్టమర్ షాకింగ్ కి గురయ్యాడు. అంతేకాదు... ఈ సంఘటనపై అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కోల్ కత్తాకు చెందిన కౌశిక్ దత్తా.. ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే.. జొమాటో యాప్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఉంచుతోంది. డెలివరీ బాయ్ పేరుతో పాటు అతను ఏ భాషలు మాట్లాడగలడు.. అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటి వివరాలన్నింటనీ ఉంచుతున్నారు.

ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ట్రాక్ చేసే సమయంలో డెలివరీ బాయ్ వివరాలు కనిపించాయి.  డెలివరీ బాయ్ పేరు మిరాజ్ అని, హిందీ, బెంగాలీ భాషలు మాట్లాడగలడని అందులో ఉంది. అయితే.. ఆ తర్వాత మిరాజ్ క్వాలిఫికేషన్ చూసిన దత్తా షాకయ్యాడు. మిరాజ్ పోస్ట్ గ్యాడ్యుయేషన్(పీజీ) చేశాడని చూసి షాకయ్యాడు. 

కోల్‌కత్తా యూనివర్సిటీలో మిరాజ్ ఎంకామ్ చేశాడని తెలిసుకున్న దత్తా.. ఫేస్ బుక్ లో ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు.  ‘ఈ దేశం కోసం మనం ఏం చేస్తున్నాం.. ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాం.. టెన్త్ క్లాస్ చదివే వ్యక్తితో పాటు పీజీ చేసిన వ్యక్తి కూడా ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్న పరిస్థితిలో.. ఎటు పోతున్నాం’ అని దత్తా పెట్టిన పోస్ట్  ఇప్పుడు వైరల్‌గా మారింది.

click me!