చిన్నారిపై అత్యాచారం...టీచర్‌కు ఉరిశిక్ష, మార్చి 2న అమలు

By Siva KodatiFirst Published Feb 5, 2019, 9:24 AM IST
Highlights

తన  వద్ద చదువుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..గతేడాది జూన్ 30న నాలుగేళ్ల చిన్నారిని మహేంద్ర సింగ్ గోండ్ం అనే ఉపాధ్యాయుడు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి... ఆమెపై అత్యాచారం చేశాడు.  

తన  వద్ద చదువుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..గతేడాది జూన్ 30న నాలుగేళ్ల చిన్నారిని మహేంద్ర సింగ్ గోండ్ం అనే ఉపాధ్యాయుడు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి... ఆమెపై అత్యాచారం చేశాడు.  

తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోవడంతో చిన్నారి చనిపోయిందని అక్కడే వదిలేసి పారిపోయాడు. తమ కూతురు ఎంతకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, ఇరుగుపోరుగు సాయంతో అటవీ ప్రాంతంలో వెతుకుతుండగా చిన్నారి జాడ కనిపించింది.

వెంటనే ఆమెను ఆషుపత్రికి తీసుకెళ్లగా..వైద్యులు బాలిక అత్యాచారానికి గురైనట్లు తెలిపారు. కేసు సంచలనం సృష్టించడంతో పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంటల వ్యవధిలోనే ఉపాధ్యాయుడిని పట్టుకున్నారు.

చిన్నారి పరిస్థితి విషమించడంతో రాష్ట్ర ప్రభుత్వం హెలికాఫ్టర్‌లో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించింది. అయితే ఉపాధ్యాయుడి అకృత్యానికి పాప పేగులు బాగా దెబ్బతినడంతో నెలల తరబడి మంచానికే పరిమితమైంది.

బాలికను కాపాడటానికి వైద్యులు ఎన్నో శస్త్రచికిత్సలు చేసి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో విచారణ చేపట్టిన నాగోద్ జిల్లా సెషన్స్ కోర్టు గత సెప్టెంబర్‌లో నిందితుడైన ఉపాధ్యాయుడికి ఉరిశిక్ష విధించింది.

హైకోర్టు సైతం శిక్షను సమర్ధించింది. ఈ క్రమంలో శాంతా జిల్లా సెషన్స్ కోర్టు మహేంద్రసింగ్ గోండ్‌కు వ్యతిరేకంగా బ్లాక్ వారెంట్ జారీ చేసింది. అతడికి వచ్చే నెల 2న ఉరిని అమలు చేయాల్సిందిగా జబల్‌పూర్ కేంద్ర కారాగారాన్ని ఆదేశించింది.

సుప్రీంకోర్టు లేదా రాష్ట్రపతి నుంచి ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు రాకపోతే ఉరిశిక్ష యథాతథంగా అమలవుతుంది. ఇది అమలైతే చిన్నారులపై అత్యాచార నిరోధానికి తీసుకొచ్చిన కొత్త చట్టం కింద అమలు చేసే తొలి మరణశిక్ష మహేంద్ర సింగ్ గోండ్‌దే అవుతుంది.

click me!