సిఈసీని కలిసిన విపక్షాలు: ఈవీఎంలపై ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Feb 4, 2019, 9:13 PM IST
Highlights


మరోవైపు ఈవీఎంల అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 23పార్టీలకు చెందిన ప్రతినిధులమంతా ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఈవీఎంలలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

ఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్నే అమలు చెయ్యాలని బీజేపీయేతర పార్టీలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విపక్షాలు ఈవీఎంలలో అవకతవకలపై ఫిర్యాదు చేశాయి. 

పోలైన ఓట్లలో కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని ఈసీని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు.  ఈవీఎంలపై తయారు చేసిన నివేదికను సీఈసీకి విపక్షనేతలు అందజేశారు. 

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విపక్షాల నేతలు ఈవీఎంలలో మరింత పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని ఈసీని కోరినట్లు వివరించారు. ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌ స్లిప్పులను సురక్షితంగా ఉంచాలని కోరినట్లు ఆజాద్ స్పష్టం చేశారు. 

ఎవరి ఓట్లు ఎవరికి వెళ్తున్నాయనే అవగాహన పార్టీలకు తెలిసి ఉంటుందని పోలైన ఓట్ల విషయం సాంకేతిక కమిటీలకు తెలియదని తెలిపారు. ఈవీఎంలో ఏ పార్టీ గుర్తు నొక్కినా ఓట్లు బీజేపీకు వెళ్తున్నాయని ఆజాద్‌ ఆరోపించారు. 

మరోవైపు ఈవీఎంల అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 23పార్టీలకు చెందిన ప్రతినిధులమంతా ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఈవీఎంలలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

సాంకేతికంగా ముందున్న దేశాలు సైతం పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని పాటిస్తుంటే ఇండియా మాత్రం ఈవీఎలంను వినియోగిస్తుందని మండిపడ్డారు. పోలైన ఓట్లలో వీవీప్యాట్‌ స్లిప్పులు ఒక్కశాతం మాత్రమే లెక్కిస్తున్నారని తెలిపారు. 

ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్న చంద్రబాబు ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకు ఉందన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో అహ్మద్‌పటేల్‌, మల్లికార్జున ఖర్గే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, సీపీఐ నేత రాజా, ఆమ్‌ ఆద్మీ నేతలు ఉన్నారు. 

click me!