హిందూ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టమని ముస్లిం విద్యార్థికి సూచించిన టీచర్.. అరెస్ట్..

Published : Sep 29, 2023, 12:04 PM IST
హిందూ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టమని ముస్లిం విద్యార్థికి సూచించిన టీచర్.. అరెస్ట్..

సారాంశం

ఒక ముస్లిం విద్యార్థిని హిందూ క్లాస్‌మేట్‌ను చెప్పుతో కొట్టమని సూచించినందుకు ఓ స్కూల్ టీచర్ అరెస్ట్ అయ్యింది. స్కూల్ నుంచి సస్పెండ్ చేయబడింది.

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌, ముజఫర్‌నగర్‌లోని ఒక పాఠశాలలో అమానుష ఘటన వెలుగుచూడడంతో ఓ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. క్లాస్ రూంలో ఓ ముస్లిం విద్యార్థిని తోటి హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమని చెప్పాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ టీచర్ ను పాఠశాల నుండి సస్పెండ్ చేశారు.

ఈ సంఘటన సెప్టెంబర్ 26న జరిగింది. సజిష్ట అనే టీచర్ 5వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే, అందులో ఓ విద్యార్థి సమాధానాలు చెప్పలేకపోయాడు. దీంతో ఆ టీచర్ ఒక ముస్లిం తోటి విద్యార్థిని బాలుడిని చెప్పుతో కొట్టమని చెప్పారు.

ఉజ్జయిని అత్యాచార ఘటన : పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన బాలిక.. కానీ ఆలోపే..

ఇది అప్పుడే వెలుగులోకి రాలేదు. ఈ ఘటన తరువాత హిందూ విద్యార్థి మనోవేదనకు గురై ఇంటికే పరిమితం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి స్కూలుకు వెళ్లకుండా, ఒంటరిగా ఉండడం, డల్ గా అయిపోవడం చూసి విషయం ఏంటని తండ్రి ఆరాతీశాడు. వెంటనే ఆ చిన్నారి ఏడుస్తూ తన బాధను తండ్రికి చెప్పుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై సెప్టెంబర్ 27 న కేసు నమోదు చేశారు. 

విచారణ తరువాత, పోలీసులు, సెప్టెంబర్ 28న, టీచర్ ను అరెస్టు చేశారు, పాఠశాల అధికారులు ఆమెను విధుల నుండి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు తమ ముస్లిం క్లాస్‌మేట్‌ను చెప్పుతో కొట్టమని తరగతిలోని పిల్లలకు సూచించినందుకు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నెల తర్వాత ఇది జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిమీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!