క్లాస్ రూమ్ లో ఓ టీచర్ చేసిన పని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ: క్లాస్ రూమ్ లో ఓ టీచర్ ఓ సినిమా పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ చేస్తున్న టీచర్ ను ఇద్దరు విద్యార్ధులు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ సినిమా బంటి ఔర్ బబ్లీలో ఐశ్వర్యరాయ్ నటించిన కజ్‌రారే పాటకు టీచర్ డ్యాన్స్ చేశారు. ఓ విద్యార్ధిని కూడ టీచర్ తో కలిసి స్టెప్పులేశారు.
also read:హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)
క్లాస్ రూమ్ లో ఉన్న బ్లాక్ బోర్డులో టీచర్ బర్త్ డేను పురస్కరించుకొని హ్యాపీ బర్త్ డే మేడం అని రాసి ఉంది. ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వందలాది మంది వీక్షించారు.క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్ చేయడాన్ని కొందరు నెటిజన్లు తప్పు బట్టారు. మరికొందరు నెటిజన్లు టీచర్ డ్యాన్స్ చేయడాన్ని సమర్ధించారు.
also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి
గతంలో కూడ ఇదే తరహాలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
గత ఏడాది డిసెంబర్ మాసంలో కూడ మరో స్కూల్ లో విద్యార్థులతో కలిసి ఓ టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. విద్యార్థులతో కలిసి టీచర్ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. 2021 డిసెంబర్ మాసంలో కొందరు టీచర్లు క్లాస్ రూమ్ లో విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Never imagined we’d see a day where teachers are dancing literally on an item song inside a classroom. pic.twitter.com/4mKUl05RHY
— Jeetas posting their L”s (SWAGGY ERA) (@yeazlas)