20ఏళ్ల క్రితం అత్యాచారం.. లాయర్ గా మారి పగతీర్చుకున్న విద్యార్థిని

By telugu news teamFirst Published Oct 17, 2020, 11:52 AM IST
Highlights

డార్జీలింగ్ హోంలో చదువుతున్నప్పుడు 14 ఏళ్ల తనపై తన ప్రయివేటు ట్యూటర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతేడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాదాపు 23 సంవత్సరాల క్రితం ఆమెపై ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు.  ఆమెపై కీచక ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆనాడు జరిగిన దానికి ఆమె ఇప్పుడు పగతీర్చుకుంది. తనపై మానవ మృగంలా పడి దారుణంగా ప్రవర్తించిన ఆ ఉపాధ్యాయుడిపై పగ పెంచుకున్న ఆమె.. ఇటీవల లాయర్ గా మారి పగ తీర్చుకుంది. ఈ సంఘటన డార్జిలింగ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డార్జీలింగ్ హోంలో చదువుతున్నప్పుడు 14 ఏళ్ల తనపై తన ప్రయివేటు ట్యూటర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతేడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 40వ పడిలో ఉన్న సదరు ఉపాధ్యాయుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ సందర్భంగా బాధితురాలు హాంకాంగ్ నుంచి మాట్లాడుతూ  ‘‘చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇది కేవలం చిన్న విజయం మాత్రమే. ఆ దుర్మార్గుడి బెయిల్ దరఖాస్తు ఇటీవల తిరస్కరణకు గురైంది. అతడిపై అత్యంత కట్టుదిట్టంగా కేసు కట్టిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’’ అని పేర్కొన్నారు.

నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి దాదాపు 20 సంవత్సరాలు ఎందుకు ఎదరుచూశావు అంటూ తనను చాలా మంది ప్రశ్నించారని ఆమె అన్నారు. దానికి ఆమె సమాధానం కూడా ఇచ్చింది.

‘‘అప్పట్లో నేను చాలా భయపడ్డాను. తీవ్ర గందరగోళానికి గురయ్యాను. ఈ దారుణాన్ని ఎలా ఎదిరించాలన్న అవగాహన నాకు లేదు. లైంగిక వేధింపులు, అత్యాచారాలపై ఆధారాలతో ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం చాలా కష్టం. ప్రత్యేకించి మనసులో ఎక్కడో సమాధి చేసిన తర్వాత అది మరింత కష్టం. నిందితుడు ఇప్పటికీ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసి.. అతడిపై ఎలాగైనా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను.. ’’ అని ఆమె పేర్కొన్నారు. 

ఆనాటి పీడకల గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ కష్టంగానే ఉందని సదరు న్యాయవాది పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల పాటు అతడు తనకు నరకం చూపించాడని..  ఆ పీడకల ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని ఆమె పేర్కొంది. మిగతా పిల్లలు అతడి బారిన పడకుండా ఆపాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు.

కాగా ఈ కేసుపై డార్జీలింగ్ డిప్యూటీ ఎస్పీ రాహుల్ పాండే మాట్లాడుతూ... ‘‘ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. సిలిగురిలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న అతడిని అక్టోబర్ మొదట్లో అదుపులోకి తీసుకున్నాం...’’ అని పేర్కొన్నారు.

 అతడి అకృత్యాలపై స్పష్టమైన ఆధారాలు లభించాయనీ.. ఇప్పటి వరకు నలుగురు బాధితులతో మాట్లాడి ఆధారాలు సేకరించామని పాండే పేర్కొన్నారు. ‘‘నిందితుడు కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ అతడు ఓ స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కి మారుతుంటాడు. గత 20 ఏళ్లలో కనీసం అతడు 5 స్కూళ్లు మారినట్టు గుర్తించాం. ఈ నెల 23 వరకు కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది..’’ అని పాండే వివరించారు. 

click me!