నిన్ను కాల్చం.. లొంగిపో.. ఉగ్రవాదితో భారత జవాన్లు.. ఎమోషనల్ వీడియో

Published : Oct 17, 2020, 10:19 AM ISTUpdated : Oct 17, 2020, 10:36 AM IST
నిన్ను కాల్చం.. లొంగిపో.. ఉగ్రవాదితో భారత జవాన్లు.. ఎమోషనల్ వీడియో

సారాంశం

అప్పటి నుంచి అతని కోసం వాళ్ల కుటుంబసభ్యులు గాలిస్తూనే ఏన్నారు. శుక్రవారం జరిపిన ఓ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతను జహంగీరే అని జవాన్లు గుర్తించారు.

ఆవేశంలో ఉగ్రవాదిగా మారిపోయాడు. కానీ.. కరుడుగట్టిన ఉగ్రవాదుల మధ్య అతను ఇమడలేకపోయాడు. వారిలా రక్తం చిందించలేకపోయాడు. దానికితోడు.. తన కోసం ఎదురుచూస్తున్న తండ్రి దగ్గరకు వెళ్లాలని అనుకున్నాడు. కానీ.. తాను కరుడుగట్టిన ఉగ్రవాదుల మధ్య ఉన్నానన్న విషయం గుర్తొచ్చి ఆగిపోయాడు. కానీ.. అతనికి ఆర్మీ జవాన్లు సొంత సోదరుల్లా కనిపించారు. నీకేమీ కాదు.. మా వద్దకు రా అంటూ ఆపన్న హస్తం ఇచ్చారు. దీంతో.. ఆ ఉగ్రవాది.. ఆర్మీ జవాన్లకు లొంగిపోయాడు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ నెల 13న ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రెండు ఏకే-47 తుపాకులతో కనిపించకుండా పోయాడు. అదే రోజు చదూర ప్రాంతంలో జహంగీర్ భట్ అనే యువకుడు ఆచూకీ లేకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కోసం వాళ్ల కుటుంబసభ్యులు గాలిస్తూనే ఏన్నారు. శుక్రవారం జరిపిన ఓ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతను జహంగీరే అని జవాన్లు గుర్తించారు.

 

అతని తండ్రి ఎన్ కౌంటర్ జరుగుతున్న స్థలానికి తీసుకువచ్చారు. లొంగిపోవాలని అతని తండ్రితో చెప్పించారు. భయంతో వణికిపోతూ తోటలో ఓ పొదల చాటున దాక్కున్న జహంగీర్ కు తండ్రి మాట విని బయటకు రాకుండా ఉండలేకపోయాడు.

‘దేవుడి మీద, మీ కుటుంబసబ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం.. నీకేమీ కాదు.. నిన్నెవరూ కాల్చరు.. వచ్చి లొంగిపో’ అంటూ జవాన్లు అతనికి హామీ ఇచ్చారు. దీంతో.. తుపాకీ పక్కన పెట్టి లొంగిపోయాడు. లొంగిపోయిన ఉగ్రవాదికి సైనికులు తాగడానికి మంచినీరు ఇచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం తమ కుమారుడిని తమకు అప్పగించినందుకు జహంగీర్ తండ్రి దన్యవాదాలు చెప్పాడు. కాగా.. ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu