జ్యోతిష్కుడి మాట విన్నాడు.. పాము కాటుతో నాలుక పోగొట్టుకున్నాడు

By Mahesh KFirst Published Nov 26, 2022, 1:53 PM IST
Highlights

తమిళనాడులో ఓ రైతు జ్యోతిష్కుడి మాటలు విని ఉన్న నాలుకను పోగొట్టుకున్నాడు. తరచూ పాము కలలు వస్తున్నాయని, ఆ కలల్లో పాములు తనను కాటేస్తున్నాయని రైతు రాజా జ్యోతిష్కుడికి తెలిపాడు. దీనికి జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా వినడంతో ఆ రైతు నాలుకపై పాము కాటు వేసింది.
 

చెన్నై: తమిళనాడులో ఓ జ్యోతిష్కుడి సలహా ఓ రైతుకు ప్రమాదకరంగా మారింది. ప్రాణాలకే ముప్పు తెచ్చింది. నాలుక పై పాము కాటేసేలా చేశాయి. చివరకు ఆ వ్యక్తి తన నాలుకనూ కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనడులోని ఎరోడ్‌లో చోటుచేసుకుంది.

కొపిచెట్టిపాలయంకు చెందిన 54 ఏళ్ల రాజా కలలోకి తరుచూ పాములు వస్తున్నాయి. ఆ కలల్లో అతను పాము కాటుకు గురవుతున్నాడు. ఈ వ్యవహారంపై కలవరం చెందిన రాజా ఇందుకు పరిష్కారం కోసం ప్రయత్నించాడు. ఇందులో భాగంగా ఓ జ్యోతిష్కుడిని కలిశాడు. ఆ జ్యోతిష్కుడు డెడ్లీ సజేషన్ ఇచ్చాడు.

ఈ పాము కలల నుంచి తప్పించుకోవాలంటే రాజాను ఓ సర్ప ఆలయా నికి వెళ్లాలని జ్యోతిష్కుడు సూచించాడు. అక్కడ కొన్ని పూజలు చేయాలని సూచనలు చేశాడు. జ్యోతిష్కుడి సలహా మేరకు ఆ రైతు సర్ప ఆలయా నికి వెళ్లాడు.అక్కడ పూజ తంతు ముగించుకున్నాడు. ఆ తర్వాత చివరిలో అక్కడే ఉన్న రస్సెల్ వైపర్ ముందు మూడు సార్లు నాలుక తెరిచి ఉంచాడు. మూడు సార్లు నాలుక తీసి ఆ పాము ముందు ఉంచి వెనక్కి తీసుకోవాలని జ్యోతిష్కుడు చెప్పాడు. రాజా ఆ సూచనలనే ఫాలో అయ్యాడు. కానీ, రాజా నాలుకను చూసి రస్సెల్ వైపర్ యాక్టివ్ అయింది. లిప్తకాలంలోనే ఆ వ్యక్తి నాలుకను రస్సెల్ వైపర్ కాటేసింది.

Also Read: పామును ముద్దాడబోతే... కసిదీరా పెదవులపై కాటేసింది.. చికిత్స తీసుకుంటూ....

ఆ ఆలయ పూజారి ఈ ఘటన చూడగానే వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఆ వ్యక్తి నాలుకను కట్ చేశాడు. వెంటనే ఆయనను ఎరోడ్ మేనియర్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఆ వ్యక్తికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్లుతుండగా ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. 

మేనియన్ మెడికల్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సెంథిల్ కుమారన్ మాట్లాడుతూ, తెగిపోయిన రాజా నాలుకకు వైద్యులు చికిత్స చేశారని వివరించారు. పాము విషానికి విరుగుడునూ ఆయనకు ఇచ్చినట్టు తెలిపారు.

click me!