చెన్నైలో కాలుపెట్టిన 24 గంటల్లోనే ఫస్ట్ షాక్: చిన్నమ్మ ఆస్తుల జప్తు..!!

By Siva KodatiFirst Published Feb 9, 2021, 9:34 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ రాకతో తమిళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఆమె రాష్ట్రంలోకి అడుగుపెట్టి 24 గంటలు గడిచాయో లేదో అప్పుడే అన్నాడీఎంకే ప్రభుత్వం చిన్నమ్మకు షాక్‌ ఇచ్చింది. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ రాకతో తమిళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఆమె రాష్ట్రంలోకి అడుగుపెట్టి 24 గంటలు గడిచాయో లేదో అప్పుడే అన్నాడీఎంకే ప్రభుత్వం చిన్నమ్మకు షాక్‌ ఇచ్చింది.

ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. 

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని సోమవారం చెన్నైకు చేరుకున్న శశికళకు అభిమానులు భారీ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా దివంగత సీఎం జయలలితకు తానే వారుసురాలిని, అన్నాడీఎంకే తనదేనని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పూనుకుందని సమాచారం. ఈ క్రమంలోనే శశికళకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం జప్తు చేసింది.

Also Read:శశికళకు ఫోన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్.. ఆరోగ్యం గురించి ఆరా...

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో చిన్నమ్మకు ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది.

అయితే వీటిలో ఎక్కువ భాగం ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరన్‌ పేరుతో ఉన్నట్లు సమాచారం. కాగా, శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల్ని జప్తు చేయాలని సుప్రీంకోర్టు 2017లో తీర్పునివ్వగా ఇప్పుడు పళని  సర్కార్ చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!