నయన్- విఘ్నేష్‌లకు ఊరట... వారిద్దరి సరోగసి చట్టబద్ధమే : తమిళనాడు సర్కార్ ప్రకటన

Siva Kodati |  
Published : Oct 26, 2022, 05:51 PM ISTUpdated : Oct 26, 2022, 05:59 PM IST
నయన్- విఘ్నేష్‌లకు ఊరట... వారిద్దరి సరోగసి చట్టబద్ధమే : తమిళనాడు సర్కార్ ప్రకటన

సారాంశం

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్‌లకు ఊరట లభించింది. వీరిద్దరి సరోగసి చట్టబద్ధమేనని తమిళనాడు ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది.

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్‌లకు ఊరట లభించింది. వీరిద్దరి సరోగసి చట్టబద్ధమేనని తమిళనాడు ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. కవల పిల్లల విషయంలో నయన్ దంపతులు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2016 మార్చిలోనే నయనతార- విఘ్నేష్‌లకు వివాహం జరిగిందని.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సరోగసి ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది. అంతా చట్టబద్ధంగానే జరిగిందని తమిళనాడు ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ నివేదిక సమర్పించింది. 

ఇటీవల నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు.ఈ సంఘటన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు.  పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అంటే వీరిద్దరూ పెళ్ళికి ముందే సరోగసి ప్లాన్ చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందడం వివాదంగా మారింది. సరోగసి ద్వారా పిల్లలు పొందాలంటే వివాహం జరిగి కనీసం ఐదేళ్లు గడచి ఉండాలి. ఇలాంటి నిబంధనలు చాలా ఉన్నాయి. ఈ వివాదం నేపథ్యంలో తమకి పెళ్లి జరిగిన ఆరేళ్ళు అవుతోంది అని నయన్, విగ్నేష్ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరేళ్ళ క్రితమే  తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు.  
 

PREV
click me!

Recommended Stories

మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!
2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu