కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఖర్గేకు నా పూర్తి మద్దతు, సహకారం అందిస్తా - శశి థరూర్

By team teluguFirst Published Oct 26, 2022, 5:13 PM IST
Highlights

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన శశి థరూర్ హాజరయ్యారు. ఖర్గేకు తన పూర్తి మద్దతు, సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లడంలో మల్లికార్జున్ ఖర్గేకు తన పూర్తి మద్దతు, సహకారం అందిస్తానని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేత, ఎంపీ  శశి థరూర్ హామీ ఇచ్చారు. 24 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగింది. 

ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకోండి.. కేరళ సీఎం పినరయి విజయన్ కు గవర్నర్ లేఖ... ఎందుకంటే..?

ఈ కార్యక్రమానికి శశి థరూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో ఆయన సంతోషంగా పాల్గొన్నారు. ఖర్గే, సోనియా గాంధీ పక్కన కూర్చున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.

కోయంబత్తూర్ కారు పేలుడు.. ఎన్ఐఏతో విచారణ జరిపించాలని తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం 

ఈ కార్యక్రమం అనంతరం శశిథరూర్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఖర్గే జీ తన కొత్త కార్యాలయంలో ఒక లాంఛనప్రాయంగా కూర్చున్న తరువాత కొంత సమయం సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లడంలో నా పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తానని ఆయనకు ప్రతిజ్ఞ చేశాను’’ అని పేర్కొన్నారు. అయితే పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుక అనంతరం ఖర్గే, సోనియా గాంధీలతో కలిసి కూర్చున్న చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.

लोकतंत्र जिंदाबाद! pic.twitter.com/ECuszeX2t8

— Congress (@INCIndia)

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 80 ఏళ్ల ఖర్గే తన 66 ఏళ్ల ప్రత్యర్థి థరూర్‌పై 84 శాతానికి పైగా ఓట్లను సాధించి విజయం సాధించారు. 9,385 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల ఓట్లకు గాను ఖర్గే 7,897 ఓట్లను సాధించారు. థరూర్ 1072 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికలు అక్టోబర్ 17వ తేదీన జరిగాయి. అక్టోబర్ 19వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 

click me!