
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే కోఆర్డినేటర్ ఓ పనీర్‌సెల్వం సతీమణి విజయలక్ష్మీ పనీర్‌సెల్వం(66) కన్నుమూశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గుండెపోటుతో బుధవారం ఉదయం మరణించారు. కొన్ని వారాలుగా ఆమె హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తాజాగా, గుండెపోటుతో మృతిచెందారు.
పనీర్‌సెల్వం స్వస్థలం పెరియకులానికి ఆమె భౌతిక దేహాన్ని తీసుకెళ్లనున్నారు. గురువారం ఆమె భౌతిక దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సీఎం ఎంకే స్టాలిన్, మినిస్టర్ దురయి మురుగన్, తంగమ్ తెన్నారసు, పీకే సేకర్ బాబు, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి, పార్టీ సీనియర్ నేతలు హాస్పిటల్ చేరుకున్నారు. విజయలక్ష్మీ భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. కన్నీరుమున్నీరవుతున్న పనీర్‌సెల్వానికి ధైర్యం చెప్పారు. ఆయనకు సానుభూతి ప్రకటించారు.
విజయలక్ష్మీ మృతి వార్త వినగానే ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీ నుంచి హాస్పిటల్‌కు పరుగున చేరుకున్నారు. ఈ రోజు అసెంబ్లీ కార్యకలాపాల్లో వారు పాల్గొనడం లేదు.