జామీనుపై బైటికి వచ్చి... 23 యేళ్లుగా అజ్ఞాతంలో జీవితఖైదీ.. చివరికి...

By AN TeluguFirst Published Sep 1, 2021, 11:08 AM IST
Highlights

ఈ కేసు విచారించిన తిరునల్వేలి క్రిమినల్‌  కోర్టు 1995లో నిందితుడు పచ్చాత్తుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యావజ్జీవ శిక్షను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన పచ్చాత్తు జామీనుపై విడుదలయ్యాడు.

చెన్నై : హత్యకేసులో శిక్ష విధించబడి 23 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఓ వ్యక్తిని కేరళలోని అంబాసముద్రం పోలీసులు అరెస్టు చేశారు. తిరునల్వేలి జిల్లా  అంబాసముద్రం  సమీపంలోని  గౌతమపురి గ్రామానికి చెందిన పచ్చాత్తు (72) పట్టు ముత్తు అనే వ్యక్తిని 1992లో హత్య చేయగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసు విచారించిన తిరునల్వేలి క్రిమినల్‌  కోర్టు 1995లో నిందితుడు పచ్చాత్తుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యావజ్జీవ శిక్షను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన పచ్చాత్తు జామీనుపై విడుదలయ్యాడు.

ఆ తరువాత 1998లో తీర్పు వెలువరించిన హైకోర్టు, దిగువ కోర్టు  వెలువరించిన తీర్పును సమర్థించింది. తీర్పు వెలువరించిన రోజు నుంచి పచ్చా తు అదృశ్యమయ్యాడు. కోర్టు అతనిమీద పీడీ వారెంట్లు కూడా జారీ చేసింది.  జిల్లా ఎస్పీ మణివన్నన్ ఉత్తర్వులతో అంబాసముద్రం సీఐ ఫ్రాన్సిస్ నేతృత్వంలో పచ్చాత్తును అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు అయింది.  

వీరు పచ్చాత్తు బంధువులను విచారించే సమయంలో భార్యతో అతను మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నారు. భార్యను విచారించిన ప్రత్యేక బృందం, పచ్చాత్తు  కేరళ రాష్ట్రం తోడుపులాలో ఉన్న ప్రైవేటు లాడ్జీలో పేరు మార్చుకుని వాచ్మెన్ గా పని చేస్తున్నాడని తెలిసింది. దీంతో, అక్కడకు వెళ్లిన పోలీసులు అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి పాళయం కోట కేంద్ర కారాగారానికి తరలించారు.

click me!