ఆ ప్రాజెక్ట్‌లతో చెన్నైకి ముప్పు.. తక్షణం నిలిపివేయండి : జగన్‌కు స్టాలిన్ లేఖ

Siva Kodati |  
Published : Aug 13, 2022, 06:45 PM IST
ఆ ప్రాజెక్ట్‌లతో చెన్నైకి ముప్పు.. తక్షణం నిలిపివేయండి : జగన్‌కు స్టాలిన్ లేఖ

సారాంశం

ఏపీ- తమిళనాడు సరిహద్దుల్లో ఆనకట్టల నిర్మాణాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం లేఖ రాశారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా .. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆనకట్టలు నిర్మించొద్దని స్టాలిన్ కోరారు.   

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం లేఖ రాశారు. ఏపీ- తమిళనాడు సరిహద్దుల్లో ఆనకట్టల నిర్మాణాలపై లేఖలో పేర్కొన్నారు. కోశస్థలి నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఆయన ఖండించారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా .. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆనకట్టలు నిర్మించొద్దని స్టాలిన్ కోరారు. రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే... చెన్నైకి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆనకట్టల నిర్మాణం ఆపాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలివ్వాలని స్టాలిన్ కోరారు. నదీపరివాహక ప్రాంతంలో భవిష్యత్తులోనూ .. ఆనకట్టల నిర్మాణం చేపట్టవద్దని లేఖలో జగన్‌కు విజ్ఞప్తి చేశారు స్టాలిన్. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు