తమిళనాడు బోరు బావి ప్రమాదం: సుజిత్ కథ విషాదాంతం

By sivanagaprasad KodatiFirst Published Oct 29, 2019, 7:31 AM IST
Highlights

గంటల పాటు పడిన శ్రమ వృథా అయ్యింది. కోట్లాది మంది ప్రార్థనలను దేవుడు ఆలకించలేదు. తమిళనాడులో బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ మరణించాడు. బాబును సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు మూడు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించాయి.

గంటల పాటు పడిన శ్రమ వృథా అయ్యింది. కోట్లాది మంది ప్రార్థనలను దేవుడు ఆలకించలేదు. తమిళనాడులో బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ మరణించాడు. బాబును సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు మూడు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించాయి.

అయితే ముందుగా అనుకున్న లోతు కంటే మరింత అడుగుకు బాలుడు జారిపోవడంతో చిన్నారిని రక్షించడం సాధ్యం కాలేదు. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో సుజిత్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.

Also Read:మృత్యుంజయుడు: 100 అడుగుల బోరు బావి నుంచి బాలుడి వెలికితీత

భౌతికకాయం పూర్తిగా కుళ్లిపోయింది.. అనంతరం మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్ శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే.. 

బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ ను వెలికి తీసేందుకు గాను తిరుచ్ఛిపల్లి, కోయంబత్తూరు, మధురై నుండి నిపుణుల బృందం వచ్చింది.పసిబాలుడి నడుము చుట్టూ తాడును బిగించి  బోరు బావి నుండి వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. మూడు దఫాలు ఈ రకంగా చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. 

సుజిత్ ను బోరు బావి నుండి వెలికితీసేందుకు గాను బోరు బావి పక్కనే సమాంతరంగా మరో సొరంగం తవ్వుతున్న సమయంలో సుజిత్ విల్సన్  బోరు బావిలో మరింత కిందకు జారిపోయినట్టుగా  తమిళనాడు రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

తొలుత 27 అడుగుల లోతులో ఉన్న సుజిత్ విల్సన్ ఆ తర్వాత 70 అడుగుల  లోతులోకి కూరుకుపోయినట్టుగా మంత్రి  విజయభాస్కర్ చెప్పారు.బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్ ను బయటకు తీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్, ఎన్‌ఎల్‌సీ సిబ్బంది బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

Also Read:బోరు బావిలో పడిన మోక్షిత మృతి: ఎమ్మెల్యే నల్లపురెడ్డి దాతృత్వం

బోరు బావిలో పడిపోయిన బాలుడిని సజీవంగా ఉంచేందుకు ఆక్సిజన్ ను నిరంతరరాయంగా సరఫరా చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.శనివారం నాడు ఉదయం నుండి ఆ బాలుడి శబ్దాలు తాము వినలేదని రెస్క్యూ సిబ్బంది ప్రకటించారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

click me!