మోదీ మళ్లీ గెలిస్తే దేశ రాజధానినే మారుస్తాడు..: కమల్ హాసన్ కామెంట్స్ పై అన్నామలై కౌంటర్

By Arun Kumar PFirst Published Apr 10, 2024, 1:20 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ తమిళ రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. ప్రముఖ హీరో కమల్ హాసన్ ప్రధానిని గెలిపిస్తే రాజధానినే మార్చేస్తాడంటే..  అతడికి అన్నామలై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటలయుద్దం సాగిందిలా... 

చెన్నై : తమిళనాడులో రాజకీయాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుప్పుస్వామి అన్నామలై. తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ ఐపిఎస్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అన్నామలై తాజాగా ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకులు కమల్ హాసన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. రాజధాని చెన్నైలో బిజెపి నాయకులు అన్నామలై, తమిళిసై తో కలిసి రోడ్ షో నిర్వహించారు మోదీ. ఈ భారీ రోడ్ షో లో బిజెపి నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారు. ఇలా  ప్రధాని తమిళనాడులో చేపట్టిన ప్రచారంపై స్పందిస్తూ తమిళ హీరో కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా అన్నామలై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

Latest Videos

భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిని మారుస్తుందని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మోదీ ప్రభుత్వం రాజధానిని డిల్లీ నుండి నాగ్ పూర్ కు మారుస్తుందని కమల్ ఆరోపించారు. అంటే మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే పాలన ఆర్ఎస్ఎస్ చేతిలోకి వెళ్లిపోతుందని... సంఘ్ కార్యాలయం గల నాగ్ పూర్ నుండే పాలన సాగుతుందనేలా కమల్ హాసన్ కామెంట్స్ వున్నాయి. 

ప్రధాని మోదీ పర్యటన వేళ కమల్ హాసన్ దేశ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నామలై స్పందిస్తూ... కమల్ హాసన్ ను ముందు మానసిక చికిత్స అందించాలని మండిపడ్డారు. అతడి మెంటల్ కండీషన్ దెబ్బతిందని ... అందువల్లే ఇలా అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. మంచి మెంటల్ డాక్టర్ ను కమల్ సంప్రదిస్తే బావుంటుందని అన్నామలై ఎద్దేవా చేసారు. 

అయినా దేశ రాజధానిని మార్చడం ఏమిటి? అదేలా సాధ్యం?  స్పృహ వుండే మాట్లాడుతున్నారా? అంటూ కమల్ ను ప్రశ్నించారు తమిళనాడు బిజెపి చీఫ్. చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా ప్రకటించాలని కోరితే అర్థం వుండేది... కానీ నాగ్ పూర్ కు మారుస్తారని అనడం ఏమిటి? అంటూ మండిపడ్డారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయం నాగ్ పూర్ లో వుందికాబట్టి అక్కడికి రాజధానికి మారుస్తారని అనడంలో అర్థం లేదన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కమల్ ను హెచ్చరించారు అన్నామలై. 

కమల్ హాసన్ కావలనే బిజెపిని బదనాం చేయాలని చూస్తున్నారని అన్నామలై అన్నారు. దీంతో డిఎంకె పార్టీకి దగ్గరై రాజ్యసభ సీటు దక్కించుకోవాలన్ని అతడి ఆలోచనగా బిజెపి చీఫ్ పేర్కొన్నారు. ఇలా డొంకతిరుగుడు రాజకీయాలు ఆపాలని ... కావాలంటే నేరుగా డిఎంకే తో కలిసిపోవాలని కమల్ హాసన్ కు అన్నామలై సూచించారు. 

కమల్ హాసన్, అన్నామలై ఫ్యాన్స్ వార్ : 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ఈ సమయంలో అన్నామలై, కమల్ హాసన్ మధ్య మాటలయుద్దం ఇరువురు నేతల ప్యాన్స్ మధ్య అగ్గి రాజేసింది. కమల్ హాసన్ ఫ్యాన్స్ అన్నామలైపై నెగెటివ్ గా సోషల్ మీడియా చేయగా బిజెపి నాయకులు వాటిని తిప్పికొడుతున్నారు. తమిళనాడులో బిజెపి బలపడటం చూసి కమల్ ఓర్వలేకపోతున్నాడని... అందువల్లే ఈ దుష్ప్రచారం ప్రారంభించాడని అంటున్నారు. ఇకపై బిజెపి గురించి, ప్రధాని మోదీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ది చెబుతామని కమల్ హాసన్ ను హెచ్చరిస్తున్నారు. 
 

click me!