డబ్బుల కోసం తాగుబోతు తండ్రి దారుణమైన ప్లాన్.. 32 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్ల బిడ్డను ఇచ్చి..!

Published : Oct 02, 2022, 01:51 PM IST
డబ్బుల కోసం తాగుబోతు తండ్రి దారుణమైన ప్లాన్.. 32 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్ల బిడ్డను ఇచ్చి..!

సారాంశం

తమిళనాడులో ఓ తాగుబోతు తండ్రి డబ్బుల కోసం తెగ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బిడ్డను ఇచ్చి తనకు పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తానని నిందితుడు వరదరాజు ఆఫర్ ఇచ్చాడు. ఇందుకు ఆ తాగుబోతు కూడా అంగీకరించాడు.

న్యూఢిల్లీ: తమిళనాడులో ఓ తాగుబోతు తండ్రి డబ్బుల కోసం తెగ ప్రయత్నించాడు. అప్పు పుట్టలేదు. డబ్బులూ ఎవ్వరూ ఇవ్వడం లేదు. దీంతో ఆ కర్కష తండ్రి కన్న బిడ్డనే వయసుతో పొంతన లేని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. 32 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్ల తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేసి డబ్బులు తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ, ఈ ప్లాన్ బెడిసికొట్టింది.

తమిళనాడుకు చెందిన పెరంబళూరుకు చెందిన ఓ తాగుబోతుతన బిడ్డను వరదరాజ్ అనే 32 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి చేతులు దులిపేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆ వ్యక్తి తన సోదరి ముతు లక్ష్మీతో కలిసి ప్లాన్ వేశాడు. మూడు నెలల క్రితం తన కూతురిని ఇంటి నుంచి తీసుకెళ్లాడు. కానీ, తన ప్లాన్ గురించి భార్యకు చెప్పలేదు. చివరకు తల్లి తన బిడ్డను ఓ అనాథ శరణాలయంలో కనుక్కుంది. వరదరాజ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని భర్త తీసుకున్న నిర్ణయం ఆమెను షాక్‌కు గురి చేసింది.

పోలీసుల ప్రకారం, బాలిక తండ్రి తాగుబోతు. డబ్బుల కోసం తెగ ప్రయత్నించాడు. ఆయన బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తే.. డబ్బులు ఇస్తా అని వరదరాజు ప్రామిస్ చేశాడు. దీంతో ఆ వరదరాజుకు తన బిడ్డను ఇచ్చి డబ్బులు పొందాలని తాగుబోతు తండ్రి, తన సోదరి ముతు లక్ష్మీతో కలిసి ప్రణాళిక వేశాడు.

కానీ, ఈ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు వరదరాజు పై పోక్సో యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం పోలీసులు ఆ బాలిక తండ్రి, తండ్రి సోదరి కోసం గాలింపులు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu