
తమిళనాడు : చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షం, రికార్డు స్థాయితో కురుస్తోంది. దీంతో చెన్నై నగరం, శివార్లలోని అనేక ప్రాంతాలలో వరదలకు దారితీసింది. భారీ వర్షం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కోర్ సిటీ ఏరియా అయిన నుంగంబాక్కంలో ఒకే రోజు 8 సె.మీ.లు, సబర్బన్ రెడ్ హిల్స్ 13 సె.మీ.లు, ఆ తర్వాత పెరంబూర్‌లో 12 సె.మీ.లు వర్షం నమోదయ్యింది. ఇది మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇంత భారీ వర్షం నమోదయ్యింది.
తమిళనాడులో అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావేరి డెల్టా ప్రాంతాలు, కన్యాకుమారి వంటి తీర ప్రాంతాలతో సహా 1 సె.మీ. నుండి 9 సె.మీ. వరకు వర్షాలు కురిశాయి. వర్షాల దృష్ట్యా, ఇక్కడ రెండు సబ్‌వేలు మూసివేయబడ్డాయి నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు గంటలకొద్ది ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి, సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నవంబర్ 1న నుంగంబాక్కంలో 8 సె.మీ.ల భారీ వర్షపాతం నమోదైంది. ఇది గత 30 సంవత్సరాలలో మొదటి అత్యధిక వర్షపాతం. గత 72 సంవత్సరాలలో మూడవది అని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ప్రాంతీయ వాతావరణ కేంద్రం, ఎస్. బాలచంద్రన్ విలేకరులకు తెలిపారు. 1990లో, నగరంలో 13 సె.మీ.ల వర్షపాతం నమోదైంది. 1964లో 11 సె.మీ.లు నమోదయ్యిందని... ఈ రెండూ నవంబర్ 1నే నమోదయ్యాయని తెలిపారు.
కారులో 40 పిస్తోలు, 36 మ్యాగజీన్లు.. సినిమా లెవల్లో ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు..
భారీ వర్షం కారణంగా గత రాత్రి ఒక వ్యక్తి విద్యుదాఘాతానికి గురి కాగా, నగరం ఉత్తర ప్రాంతంలోని పులియంతోప్‌లో ఓ భవనం కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. శివారులో విద్యుదాఘాతానికి గురై ఓ ఆవు మృతి చెందింది. ఉత్తర చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేట సహా కనీసం 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
అక్టోబర్ 1 నుండి నవంబర్ 1 వరకు చెన్నై జిల్లాలో 20 సెం.మీ.ల వర్షపాతం నమోదైందని, ఈ సమయానికి సగటున 28సెం.మీ.ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణం కంటే 29 శాతం తక్కువగా ఉందని బాలచంద్రన్ చెప్పారు. అయితే, అక్టోబర్ 1 నుండి 31 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, నగరంలో సాధారణం కంటే 48 శాతం తక్కువగా ఉండగా, సాధారణం 27 సెం.మీ.ల కాగా, నగరంలో 14 సెం.మీ.ల జల్లులు పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఒక్కరోజులోనే ఆ అంతరాన్ని 18 శాతం తగ్గించిందని తెలిపారు.
రానున్న 3 రోజుల పాటు తమిళనాడు పుదుచ్చేరి-కరైకల్‌లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. రాగల 24 గంటల్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేట, వెల్లూరుతో సహా ఉత్తరాది జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావేరి డెల్టా జోన్, రామనాథపురం, శివగంగ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.