కారులో 40 పిస్తోలు, 36 మ్యాగజీన్లు.. సినిమా లెవల్లో ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు..

Published : Nov 02, 2022, 06:37 AM IST
కారులో 40 పిస్తోలు, 36 మ్యాగజీన్లు.. సినిమా లెవల్లో ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు..

సారాంశం

మధ్యప్రదేశ్ లో ఓ పోలీస్ ఛేజ్ రసవత్తరంగా సాగింది. అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో అచ్చం సింగం సినిమా లెవల్ ఛేజ్ రియల్ ఘటన ఒకటి బయటపడింది. పోలీసులు నేరస్తుల్ని వెంటాడి వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెడితే... భోపాల్ లో ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా కారును పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అగ్రా- ముంబై జాతీయ రహదారిపై మధ్యప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. చివరకు నిందితులు కారు వదిలిపెట్టి అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కారులో 40 పిస్తోలు, 36 మ్యాగజీన్లు, ఇతర ఆయుధ సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు.  

ఆయుధాల తరలింపుపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు… మొదట ఇండోర్లోని రౌ ప్రాంతం కారును  అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన నిందితులు కారు వేగాన్ని పెంచి, పోలీసు వాహనాన్ని  ఢీ కొట్టి, తప్పించుకొని పారిపోయారు. ఇండోర్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖల్ ఘాట్ వద్ద మరో పోలీసు వాహనాన్ని,   బారికేడ్లను ఢీ కొట్టి దూసుకెళ్లారు. పోలీసులు సైతం దీటుగా వెంబడించడంతో ఖర్ గోన్ జిల్లాలోని సనావాడ్ ప్రాంతంలో వాహనాన్ని వదిలిపెట్టి, అందులోని నలుగురు నిందితులు పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయారు. 

పరస్పర ఇష్టంతో సెక్స్ లో పాల్గొంటే పోక్సో చట్టం ప్రకారం ‘లైంగిక వేధింపులు’ అనలేము - మేఘాలయ హైకోర్టు

హర్యానా రిజిస్టర్డ్ నెంబర్ కలిగి ఉన్న ఆ కారులోనుంచి 40 పిస్తోలు, 36 మ్యాగజీన్లు, ఐదు కాట్రిడ్జులు సాధనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విదేశీ ఆయుధాలు అధునాతన అనుకరణలు. స్వాధీనం చేసుకున్న మ్యాగజీన్న్లలో ముప్పై కాట్రిడ్జులు నింపొచ్చు. సాధారణ మ్యాగజైన్ లో పది మాత్రమే ఉంటాయి’  అని వివరించారు. నిందితుల వేట ప్రారంభించామని, వారు ఆయుధాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారో దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..