అప్పుల బాధ.. పిల్లలకు విషమిచ్చి చంపి, తామూ ఆత్మహత్య చేసుకున్న దంపతులు...

Published : Aug 11, 2021, 10:53 AM IST
అప్పుల బాధ.. పిల్లలకు విషమిచ్చి చంపి, తామూ ఆత్మహత్య చేసుకున్న దంపతులు...

సారాంశం

గత రెండు రోజులుగా వీరు ఇంటి తలుపులు తెరవలేదు. దీంతో  అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు వెళ్లి చూడగా ఇంట్లో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. 

తమిళనాడు : నీలగిరి జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఓ జంట.. తన ఇద్దరు పిల్లలను హత్యచేసి ఆ తర్వాత వారు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... అడయార్ జిల్లాలోని ఊటి సమీపంలోని పుదుమందు ప్రాంతానికి చెందిన చంద్రన్ (45), గీత (35)లు దంపతులు. వీరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. 

అయితే గత రెండు రోజులుగా వీరు ఇంటి తలుపులు తెరవలేదు. దీంతో  అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు వెళ్లి చూడగా ఇంట్లో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. పిల్లలకు విషమిచ్చి చంపిన చంద్రన్,  గీత తర్వాత తాము కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏడాదిన్నర కాలంగా సరైన ఉపాధి లేకపోవడంతో అప్పులు చేశారు. ఈ అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు