ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా: కేరళలోనే సగం కేసులు నమోదు

By narsimha lodeFirst Published Aug 11, 2021, 10:26 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.  కేరళ రాష్ట్రంలో 21,119 కొత్త కేసులు రికార్డయ్యాయి.


న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో  38,353 కరోనా కేసులు నమోదయ్యాయి.అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు ఎక్కువగా రికార్డయ్యాయి. నిన్న 17,77,962 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 38,353 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 497 మంది మరణించారు.

ఇండియాలో కరోనాతో 4,29,179 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుండి  40,013 మంది కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 3.12 కోట్ల మంది కోలుకొన్నారు. కరోనా  కేసుల రికవరీ రేటు  97.45 శాతానికి చేరింది.కరోనా కొత్త కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉందని ఐసీఎంఆర్  ప్రకటించింది.ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళలో రికార్డైనవే. కేరళ రాష్ట్రంలో 21,119 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రాష్ట్రంలో కరోనాతో 152 మంది మరణించారు.దేశంలో 39 జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో కరోనా కేసులను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

click me!