ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బ‌స్సులు ఢీ.. నలుగురు మృతి, 70 మంది గాయాలు

Published : Jun 19, 2023, 02:44 PM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బ‌స్సులు ఢీ.. నలుగురు మృతి, 70 మంది గాయాలు

సారాంశం

Cuddalore Road Accident: తమిళనాడులోని కడలూరు జిల్లా మేల్పట్టంపాక్కంలో రెండు ప్ర‌యివేటు బస్సులు ఢీకొన్న ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు చికిత్స పొందుతూ న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Road Accident: త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. రెండు ప్ర‌యివేటు బ‌స్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ  ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. 70 మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ దుర్ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని కడలూరు జిల్లాలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కడలూరు- పన్రుతి మధ్య రెండు ప్ర‌యివేటు బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఒక బస్సు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానికులు కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

 

 

ఈ ప్ర‌మాదంపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

 

PREV
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu