జమ్మూలో పాకిస్తాన్ డ్రోన్ కలకలం.. పేల్చివేసిన అధికారులు..

By AN TeluguFirst Published Jul 23, 2021, 9:20 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అర్ధరాత్రి పూట డ్రోన్లు కనిపించినట్లు నివేదికలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని పేల్చేరు. అంతేకాదు మానవరహిత వైమానిక వాహనం (యుఎవి) నుండి ఇంప్రువైజ్డ్ పేలుడు పరికరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాశ్మీర్ : జమ్మూ అఖ్నూర్ ప్రాంతంలో పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు గత రాత్రి పేల్చేశారు.  పాకిస్తాన్ డ్రోన్ల సాయంతో కుట్రకు పాల్పడుతోంది.

జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అర్ధరాత్రి పూట డ్రోన్లు కనిపించినట్లు నివేదికలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని పేల్చేరు. అంతేకాదు మానవరహిత వైమానిక వాహనం (యుఎవి) నుండి ఇంప్రువైజ్డ్ పేలుడు పరికరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు, జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాద కార్యకలాపాలకు  డ్రోన్లను ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నాయని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

"ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రోన్లను ఉపయోగించడానికి ఉగ్రవాద సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి" అని డిజిపి దిల్బాగ్ సింగ్ పిటిఐకి చెప్పారు.

జూన్ 27 న జమ్మూ వైమానిక స్థావరం వద్ద డ్రోన్ దాడి జరిగినప్పటి నుండి, ఒక్క గత నెలలోనే జమ్మూలోని పలు ప్రదేశాలలో అనేక డ్రోన్లు కనిపించాయి. దీంతో మరో డ్రోన్ దాడి ముప్పు పెరిగింది.

click me!