రష్యా‌పై పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయ విద్యార్థి..

Published : Mar 08, 2022, 11:16 AM ISTUpdated : Mar 08, 2022, 11:19 AM IST
రష్యా‌పై పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయ విద్యార్థి..

సారాంశం

ఉక్రెయిన్ చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి.. రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. అయితే అతడు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు రెండు సార్లు దరఖాస్తు చేసకున్నాడని.. అయితే అవి తిరస్కరణకు గురయ్యాయని ఆ విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు.


ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన దాడులు కొనసాగిస్తుంది. పలు నగరాల్లో బాంబులు, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తుంది. కొన్నిచోట్ల మాత్రం రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం, ప్రజలు ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఉక్రెయిన్ చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి.. రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. అయితే అతడు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు రెండు సార్లు దరఖాస్తు చేసకున్నాడని.. అయితే అవి తిరస్కరణకు గురయ్యాయని ఆ విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అసలు ఏం జరిగిందే.. 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ (Sainikesh Ravichandran) స్వస్థలం తమిళనాడులోకి కొయంబత్తూరు జిల్లా. అతడు 2018లో ఉక్రెయిన్‌ ఖర్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సు చదువుకోవడానికి అక్కడికి వెళ్లాడు.

అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. 2022 జూలై 2022 నాటికి అతడి కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే భారతీయుల తరలింపుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పెద్ద సంఖ్యలో భారతీయులను స్వదేశానికి చేర్చింది. తీవ్ర ఘర్షణాత్మక నగరాల్లో చిక్కుకుపోయిన విద్యార్థలు తరలింపు కోసం ఉక్రెయిన్, రష్యాలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. భారతీయుల తరలింపుకు సహకరించాల్సిందిగా కోరుతుంది.

ఇదిలా ఉంటే..ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన సాయినికేష్‌తో అతని కుటుంబ సభ్యులు కమ్యూనికేషన్ కోల్పోయారు. దీంతో వారు భారత రాయబార కార్యాలయం సహాం కోరారు. దీంతో రాయబార కార్యాలయం అధికారులు.. సాయినికేష్‌ను సంప్రదించగలిగారు. అయితే సాయినికేష్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలటరీ దళాలలో చేరినట్టుగా తెలియజేశారు. ఇక, ప్రస్తుతం సాయినికేష్ వాలంటీర్లతో కూడిన Georgian National Legion paramilitary unit‌లో చేరి రష్యాపై పోరాడుతున్నాడు.

ఈ క్రమంలోనే స్థానికల అధికారులు కొయంబత్తూరు జిల్లాలోని సాయినికేష్ ఇంటకి వెళ్లారు. సాయినికేష్ గురించిన వివరాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని.. కానీ అది తిరస్కరించబడిందని అధికారులు కనుగొన్నారు.  

ఇక, 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి ప్రయత్నించాడు.. కానీ దానిని సాధించలేకపోయాడు. ఆ తర్వాత అతడు అమెరికా సైన్యంలో చేరే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి చెన్నైలోని యుఎస్ కాన్సులేట్‌ను సంప్రదించాడు. అయితే దానికి ఆమోదం లభించలేదు. దీంతో సాయినికేశ్ ఉక్రెయిన్‌ వెళ్లి ఏరోస్పెస్ కోర్సు చదవాలని నిర్ణయించుకున్నాడు. 2021 జూలైలో స్వదేశానికి వచ్చిన సాయినికేష్.. ఒకటిన్నర నెలలు ఇంటివద్దే ఉన్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !